భారత్‌ బంద్‌ విజయవంతం
eenadu telugu news
Updated : 01/10/2021 21:46 IST

భారత్‌ బంద్‌ విజయవంతం


కాశీబుగ్గలో నినాదాలు చేస్తున్న వామపక్షాలు, తెదేపా నాయకులు

కాశీబుగ్గ, పలాస, ఇచ్ఛాపురం, మందస, న్యూస్‌టుడే: పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల్లో భారత్‌బంద్‌ పాక్షికంగా జరిగింది. ఆర్టీసీ బస్‌లు మధ్యాహ్నం వరకు నిలుపుదల చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వామపక్షాలు, తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు మూడు రహదారులు, పాతబస్టాండ్‌ల వద్ద మానవహారం నిర్వహించారు. ● ఇచ్ఛాపురంలో దూరప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు సాయంత్రం వరకూ కాంప్లెక్స్‌ ఆవరణలోనే నిలిచిపోయాయి. పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. బ్యాంకులు పనిచేయలేదు. మందసలో సిటు, తెదేపా, కాంగ్రెస్‌ నాయకులు సంయుక్తంగా పాల్గొని బందు నిర్వహించారు. దుకాణాలు మూయించారు. వాహనాలు తిరగకుండా చేశారు.


పలాస: బంద్‌తో బోసిపోయిన ఆర్టీసీ కాంప్లెక్స్‌

టెక్కలి, టెక్కలి పట్టణం, కోటబొమ్మాళి, కొత్తూరు: టెక్కలిలో భారత్‌బంద్‌ సంపూర్ణమైంది. వామపక్షాలతో పాటు తెదేపా, ప్రజాసంఘాల ప్రతినిధులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ డిపో వద్ద బస్సులను అడ్డుకున్నారు. వర్షంలోనూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, రైతుసంఘం, కార్మికసంఘం నాయకులు పాల్గొన్నారు. వైకాపా బంద్‌కు మద్దతివ్వడంతో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేయించారు. కోటబొమ్మాళిలో తెదేపా, సీఐటీయూ, సీపీఎం నిరసన కార్యక్రమం చేపట్టారు. కొత్తూరులో సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వాణిజ్య సముదాయాలకు దగ్గరుండి మూయించారు.


టెక్కలి: ర్యాలీగా వెళుతున్న సీపీఎం, ప్రజాసంఘాల నేతలుశ్రీకాకుళంలో ప్రైవేటు బస్సును అడ్డుకుంటున్న ప్రజాసంఘాల నేతలు

కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిల భారత సంఘాల పిలుపు మేరకు సోమవారం నిర్వహించిన భారత్‌ బంద్‌ జిల్లాలో విజయవంతమైంది. తుపాను ప్రభావం ఉన్నప్పటికీ ఆయా సంఘాల నేతలు ర్యాలీలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అన్నిచోట్లా దుకాణాలను మూయించారు. ప్రభుత్వం కూడా బంద్‌కు మద్దతు తెలపడంతో ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు రోడ్డెక్కలేదు. బడులు తెరుచుకోలేదు. డీసీసీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి, మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత గుండ లక్ష్మీదేవి, సీపీఎం నాయకుడు డి.సుబ్బారావు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.గోవిందరావు, సీపీఐఎంఎల్‌ న్యూడెమొక్రసీ నాయకుడు తాండ్ర ప్రకాష్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి బి.కృష్ణమూర్తి తదితరులు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. కార్పొరేట్‌ కంపెనీలకు ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలను కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని, వెంటనే ఈ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు.

- న్యూస్‌టుడే, కలెక్టరేట్‌, అరసవల్లి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని