మూల్యాంకనం సకాలంలో పూర్తి చేయాలి
eenadu telugu news
Published : 21/10/2021 06:23 IST

మూల్యాంకనం సకాలంలో పూర్తి చేయాలి

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ ఆరు, నాలుగు సెమిస్టర్‌ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ సకాలంలో పూర్తి చేయాలని ఉపకులపతి డా.నిమ్మ వెంకటరావు అన్నారు. వర్సిటీలో బుధవారం ఆయన మూల్యాంకన కేంద్రాల ప్రధానాచార్యులు, చీఫ్‌ ఎగ్జామినర్లతో వర్చువల్‌ విధానంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా, అనుమానాలకు తావివ్వకుండా పటిష్టంగా చేపట్టాలని సూచించారు. ఈ నెల 31లోగా మూల్యాంకనం పూర్తికావాలని ఆదేశించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ డా.తమ్మినేని కామరాజు, యూజీ పరీక్షల డీన్‌ డా.ఎస్‌.ఉదయ్‌ భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని