Published : 12/04/2021 03:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జ్యోతిబా ఫులెకు ఘన నివాళి

విశాఖపట్నం, న్యూస్‌టుడే:  జ్యోతిబా ఫులెకు ఆదివారం జిల్లా అధికారులు ఘనంగా నివాళులర్పించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో  నిర్వహించిన ఫులె జయంతి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫులె చిత్రపటానికి పూలమాల వేసి నివాలులర్పించి సేవలను కొనియాడారు. జిల్లా సంయుక్త కలెక్టర్లు పి.అరుణ్‌బాబు, ఆర్‌.గోవిందరావు, డీఆర్వో ప్రసాద్‌, బీసీ సంక్షేమశాఖ ఉప సంచాలకులు రాజేశ్వరి, బీసీ కార్పొరేషన్‌ ఈడీ పెంటోజీరావు, ఏఓ రామ్‌మోహనరావు పాల్గొన్నారు. జిల్లా న్యాయస్థానం వద్ద పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, ఇంటక్‌ నాయకుడు మంత్రి రాజశేఖర్‌ తదితరులు నివాళులర్పించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని