అయినోళ్లు కాదన్నా.. ఆత్మ బంధువులు ముందుకొచ్చారు
logo
Published : 09/05/2021 06:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అయినోళ్లు కాదన్నా.. ఆత్మ బంధువులు ముందుకొచ్చారు

మృతదేహాన్ని వాహనంలోకి ఎక్కిస్తున్న బుచ్చిబాబు, నాని

తాడేపల్లిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: కరోనా మహమ్మారి అయినవాళ్లను కడసారి చూపునకు కూడా నోచుకోకుండా చేస్తోంది. కొవిడ్‌ బారినపడిన ఓ కుటుంబానికి పెద్దకష్టమే వచ్చింది. ఇంట్లో చికిత్స పొందుతున్న భర్త చనిపోగా భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరణించిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించడానికి అయినవాళ్లు ముందుకు రాలేదు. కానీ కొందరు ఆత్మ బంధువులుగా నిలిచి అంతిమయాత్రను పూర్తి చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడేపల్లిగూడెం మండలంఆరుగొలను గ్రామానికి చెందిన అడ్డగర్ల శ్రీనివాస్‌ (35) ఈ నెల 5న కొవిడ్‌ బారినపడి ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. భార్య సత్యవాణికి రెండుసార్లు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చింది. కానీ లక్షణాలుండటంతో రెండు రోజుల కిందట స్కానింగ్‌ చేయించుకోగా కొవిడ్‌ ఉన్నట్టు తేలింది. ఆమె స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌ శనివారం ఉదయం చనిపోయారు. అతడికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవరూ ముందుకురాక పోవడంతో గ్రామ సర్పంచి పీీతల బుచ్చిబాబు, దళిత యువసేన అధ్యక్షుడు ఎం.నాని, భాజపా మండల ప్రధాన కార్యదర్శి చిక్కాల చిరంజీవి పీీపీీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని పంచాయతీ వాహనంలో శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని