close

మంగళవారం, నవంబర్ 19, 2019

ప్రధానాంశాలు

అన్నంలో వెంట్రుకలు..

హోటల్‌ యజమానికి రూ.10వేలు జరిమానా

సరూర్‌నగర్‌, న్యూస్‌టుడే: వినియోగదారులకు సరఫరా చేసే ఆహారంలో పరిశుభ్రతను పాటించని ఓ హోటల్‌పై అధికారులు చర్యలు తీసుకొని రూ.10 వేలు జరిమానా విధించారు. ఎల్బీనగర్‌ సర్కిల్‌ ఏఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ మేఘం తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కోర్టుల పక్కన ఓ హోటల్‌లో ఇద్దరు మిత్రులు భోజనం చేసేందుకు వెళ్లారు. ఆర్డర్‌ ఇచ్చి భోజనం చేసే క్రమంలో అన్నంలో వెంట్రుకలు వచ్చాయి. ఈ విషయమై హోటల్‌ నిర్వాహకులను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని వారు ఎల్బీనగర్‌ జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ మేఘం సోమవారం ఆ హోటల్‌లో తనిఖీ చేసి రూ.10 వేలు జరిమానా విధించారు. పరిశుభ్రత పాటించని హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.