మంగళవారం, డిసెంబర్ 10, 2019
ఆహ్వానపత్రికలను ఆవిష్కరిస్తున్న వేమిరెడ్డి దంపతులు
నెల్లూరు (సాంస్కృతికం) : కార్తీక మాస లక్షదీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో కార్తీకమాస లక్షదీపోత్సవాన్ని శుక్ర, శని, ఆదివారాల్లో మూడు రోజులు నెల్లూరు వీఆర్సీ మైదానంలో నిర్వహిస్తున్నామని రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తెలియజేశారు. గురువారం వీఆర్సీ మైదానంలో విలేకరుల సమావేశంలో ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి, లక్షదీపోత్సవ కమిటీ సభ్యులతో కలిసి లక్షదీపోత్సవ ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. శ్రీశైలం దేవస్థానం నుంచి ఉత్సవమూర్తులు వేదికపై కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తారన్నారు. ప్రత్యేకంగా ప్రతిష్ఠించే ఉమాపార్ధివేశ్వరస్వామి శివలింగానికి మూడు రోజులపాటు మహన్యాసపూర్వక శతరుద్రాభిషేకాలు జరుగుతాయన్నారు. శుక్రవారం సాయంత్రం 6.45 గంటలకు లక్షదీపోత్సవ కార్యక్రమాన్ని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి, శ్రీ రాధానంద భారతీస్వామి ప్రారంభిస్తారన్నారు. నోరి నారాయణ మూర్తి ప్రవచనం జరుగుతుందన్నారు. శనివారం ఉదయం చండీ యాగం, సాయంత్రం లక్షదీపోత్సవం, వర్ధిపర్తి పద్మాకర్ ప్రవచన ఉంటుందన్నారు. ఆదివారం ఉదయం 9 నుంచి సత్యనారాయణ వ్రతాలు, అన్న సంతర్పణ జరుగుతుందన్నారు. సాయంత్రం జరిగే లక్షదీపోత్సవ కార్యక్రమంలో పుష్పగిరి శంకారాచార్య మహా సంస్థాన పీఠాధిపతులు శ్రీ అభవనవోద్ధండ విద్యాశంకరభారతీ మహాస్వామి, భువనేశ్వరీ పీఠాధిపతి శ్రీ సత్యానంద భారతి మహాస్వామి పాల్గొంటారని తెలిపారు. అనంతరం శివపార్వతులు కల్యాణం జరుగుతుందన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు