శుక్రవారం, డిసెంబర్ 06, 2019
నిజామాబాద్ సాంస్కృతికం, న్యూస్టుడే: కిషన్గంజ్ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో గురువారం విశేషంగా సప్తహారతులతో కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శివలింగం, అయ్యప్పస్వామి, కాళియమర్దనం, ఏడుకొండల వేంకటేశ్వరస్వామి, షిరిడీ సాయినాథుడు వంటి ప్రతిమలకు హారతులు సమర్పించారు. లక్ష బిల్వపత్రార్చనలతో వేడుకున్నారు. పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో జరిపించారు. ఆలయప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై భక్తులే పెళ్లిపెద్దలుగా స్వామివారికి కన్యాదానం చేశారు. కానుకలను సమర్పించారు. అర్చకులు వేలేటి గౌరీశంకర్శర్మ, ఆలయ కమిటీ అధ్యక్షుడు వీరశేఖర్గుప్తా, మహేశ్వర్గుప్తా, జగదీశ్వర్గుప్తా పాల్గొన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు