సోమవారం, డిసెంబర్ 09, 2019
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 3న నెక్లెస్ రోడ్లో నిర్వహించనున్న డిసేబుల్డ్ అవేర్నెస్ వాక్కు సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్‌కు వికలాంగుల హక్కుల వేదిక విజ్ఞాపనపత్రం బుధవారం అందజేసింది. వికలాంగులకు ఉన్న ప్రత్యేక చట్టాలు, ఆ చట్టాల్లో ఉన్న వివిధ అంశాలు, సదుపాయాల గురించి వికలాంగులకు అవగాహన కల్పించే ఉద్ధేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. ఇందుకోసం స్థానికంగా వివిధ ఏర్పాట్లు చేయాలని వికలాంగుల హక్కుల వేదిక కో-ఆర్డినేటర్ కొల్లి నాగేశ్వరరావు, శ్రీనివాస్‌లతో కూడిన ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
జిల్లా వార్తలు