close

ఆదివారం, డిసెంబర్ 08, 2019

ప్రధానాంశాలు

సాంకేతిక గుట్టు.. ఉపాధి పట్టు!

వివిధ టెక్నాలజీలకు వేదికగా ఇండియాజాయ్‌-2019

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: గేమింగ్‌... అభివృద్ధి దిశలో పెద్ద పరిశ్రమ. రూ.కోట్ల వ్యాపారంతో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది. ప్రజలు కోరుకునే వినోదం అందించాలంటే సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందాలి. ఈ కోణంలోనే ప్రపంచ సాంకేతికతను పరిచయం చేసేందుకు హెచ్‌ఐసీసీలో బుధవారం ‘ఇండియాజాయ్‌-2019’ పేరుతో ప్రదర్శన కొలువుదీరింది. ఉద్యోగార్థులకు, సాంకేతిక నిపుణులకు వేదికగా మారిపోయిన ఈ ప్రదర్శనకు పెద్ద ఎత్తున స్పందన లభించింది.

కార్టూన్‌ సినిమాలు ఇలానే..
‘పర్సిస్టెంట్‌ ఆఫ్‌ విజన్‌’ అంశాన్ని ప్రత్యక్షంగా నిరూపించే యానిమేషన్‌ ప్రాక్షనల్‌ స్కోప్‌ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. పర్సిస్టెంట్‌ ఆఫ్‌ విజన్‌ ప్రకారం మనిషి కేవలం 10 నుంచి 12 చిత్రాలను మాత్రమే గుర్తుంచుకునే ఆస్కారం ఉంటుంది.ఈ సూత్రంతోనే కార్టూన్ల చిత్రాలు రూపొందిస్తున్నారు. ఇదీ అర్థమయ్యేలా తిరిగే చక్రంలో ఏర్పాటు చేసిన చిత్రాల ఆధారంగా సినిమాలు ఎలా రూపొందిస్తారో ప్రయోగంలా చూపుతున్నారు.

యూనిటీ టెక్నాలజీ...
గేమింగ్‌ రంగంలో కొత్తగా వచ్చిన యూనిటీ సాంకేతికత అందర్నీ అబ్బురపరుస్తోంది. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని వర్చువల్‌ రియాలిటీ ద్వారా గేమ్‌లోకి తీసుకురావచ్చు. అసెట్‌ స్టోర్‌ ద్వారా  మనకు కావాల్సిన అంశాలన్నింటినీ క్రోడీకరించి లఘుచిత్రంగా రూపొందించొచ్చు. గేమ్‌నూ తయారుచేయవచ్చు. దీనిపై పూర్తి అవగాహనకు యూనిటీ ప్రతినిధులు ఈ నెల 22, 23వ తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

మోషన్‌ క్యాప్చర్‌...
యానిమేటెడ్‌ మోషన్‌ పిక్చర్స్‌ గురించి వినే ఉంటారు. అవతార్‌ సినిమాకు ఈ మోషన్‌ క్యాప్చర్‌ సాంకేతికతను ఉపయోగించారు. హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ రెండు రూపాల్లోనూ ఈ మోషన్‌ క్యాప్చర్‌ దుస్తులు లభిస్తున్నాయి. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో 50 నుంచి 150 అడుగుల దూరం కదలికలను పట్టేయచ్చని గాలొరే సిస్టమ్స్‌ ప్రతినిధి ప్రభంజన్‌ తెలిపారు. వీటి ద్వారా ఎలా చిత్రీకరిస్తారో ప్రత్యక్షంగా చూపుతున్నారు.

గేమింగ్‌ రంగంలో పెరుగుతున్న ఉపాధి
- జయేశ్‌రంజన్‌, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి
గేమింగ్‌ రంగం అభివృద్ధి దిశగా సాగుతోంది. వ్యాపార పరంగానే కాకుండా ఉపాధి పరంగానూ యువతకు మంచి అవకాశాలు కల్పించనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇంటర్‌ విద్యార్హతతోనే ఉపాధి పొందొచ్చు. ప్రభుత్వం ఇంటర్‌ విద్యార్థులను ప్రోత్సహించేందుకు తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ను ఏర్పాటు చేసింది.

ఇదో చక్కటి వేదిక : దుర్గ
గెమింగ్‌లో డెవలపర్‌గా శిక్షణ తీసుకుంటున్నా.  సాంకేతికత, కొత్త తరహా గేమ్‌లు,రూపొందించే తీరు, కొత్త పరిచయాలకు ఇదో చక్కటి వేదిక.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.