బుధవారం, డిసెంబర్ 11, 2019
ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి
బేగంపేట (అమీర్పేట), న్యూస్టుడే: రోజురోజుకూ మార్పులకు గురవుతున్న వాతావరణ ప్రభావం పేదవారిపై ఎక్కువగా పడుతుందని పర్యావరణ నిపుణులు ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి పేర్కొన్నారు. ‘వాతావరణ మార్పులు-పేదరికం’పై ఇండియన్ మెట్రోలాజికల్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం బేగంపేటలోని వాతావారణ కేంద్రంలో సదస్సు నిర్వహించారు. పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల కారణంగా భూ వాతావరణం వేడెక్కుతోందని, ఉష్ణోగ్రతల ప్రభావంతో వృద్ధులు, పిల్లలు వ్యాధుల బారిన పడే అవకాశముందన్నారు. అటవీ ఉత్పత్తులపైనా తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. వాటిపై ఆధారపడేవారు నష్టపోవాల్సి వస్తుందన్నారు. 1980-2007ల మధ్య వాతావరణంలో మార్పులతో ప్రకృతి సృష్టించిన బీభత్సానికి దేశంలో కొన్ని బిలియన్ల నష్టం వాటిల్లిందన్నారు. అనంతరం వాతావరణ కేంద్రం అధిపతి కె.నాగరత్నం, మెట్రోలాజికల్ సొసైటీ శాశ్వత సభ్యులు బి.వి.సుబ్బారావు తదితరులు మాట్లాడారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు