close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

మేడారం

ఆశలు శిథిలం

అధ్వానంగా సాగునీటి కాల్వలు

రబీ సాగుకు నీటి అడ్డంకులు

ఈనాడు, నిజామాబాద్‌

ఎడపల్లి మండలం వడ్డేపల్లి వద్ద షెట్టరు పనిచేయక అడ్డుగా పెట్టిన రాళ్లు

వర్షాలు సమృద్ధిగా కురిశాయి... భూగర్భజలాలు వృద్ధి చెందాయి.. బోరుబావుల్లో నీటి మట్టం పెరిగింది... శ్రీరాంసాగర్‌ జలకళ సంతరించుకుంది... రైతులంతా ఉత్సాహంగా యాసంగి సాగుకు సిద్ధమవుతున్నారు. కాల్వల దుస్థితి చూస్తే వారి ఆశలు ఆవిరయ్యే పరిస్థితులున్నాయి. కాల్వలన్నీ పూడుకుపోయాయి.. ముళ్లపొదలతో నిండిపోయాయి.. మరికొన్ని ఆనవాళ్లు కోల్పోయాయి. వాటిలో నీరు పారే పరిస్థితే కనిపించటం లేదు. ఇంకొన్ని చోట్ల తూములు మూసుకుపోగా, షెట్టర్లు పనిచేయడం లేదు.

నీళ్లు సమృద్ధిగా ఉండటంతో రబీలో నాలుగు లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 2.70 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యే పరిస్థితులున్నాయి. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు మూడేళ్ల తర్వాత నిండింది. ప్రస్తుతం 85 టీఎంసీల మేర నీరుంది. రబీ సాగుకు ఎస్సారెస్పీ నీటి కేటాయింపులపై ఇటీవల హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. పదిహేనో తారీఖులోగానే నీటిని విడుదల చేసే ఆలోచన ఉన్నట్లు ఇటీవల సీఈ శంకర్‌ వెల్లడించారు. జిల్లాలో లక్ష్మి కాల్వ కింద 25 వేల ఎకరాలు, కాకతీయ కింద మరో పది వేల ఎకరాలకు తోడు అలీసాగర్‌, గుత్ప ఎత్తిపోతల ద్వారా లక్షా పదివేల ఎకరాలకు నీరు అందిస్తుంది. కాల్వలు సరిగా లేకపోవడం సాగుకు అడ్డంకులు కలగనున్నాయి.

ఆగిన మరమ్మతులు

లక్ష్మి కాల్వ మరమ్మతులకు రూ.20 కోట్లు మంజూరయ్యాయి. గత ఏడాది డిసెంబరులో పనులు ప్రారంభించారు. కొంతమేర పనులు చేసినప్పటికీ నిధుల విడుదలలో జాప్యం కారణంగా గుత్తేదారు వెనక్కి తగ్గారు. నిధులు విడుదల చేస్తేనే పనులు చేస్తామంటూ చేతులెత్తేయడంతో ఆ కాల్వల గుండా నీరు పారని పరిస్థితి నెలకొంది.

నిజాంసాగర్‌ కాల్వల పరిస్థితి అధ్వానమే

నిజాంసాగర్‌ ప్రధాన కాల్వలకు మరమ్మతులు చేసినప్పటికీ.. కొన్నిచోట్ల ముళ్లపొదలు పెరిగాయి. ఉప కాల్వల బాగు చేసేందుకు ఎటువంటి నిధులు లేవు. మూడేళ్లుగా వాటిని పట్టించుకోలేదు. ప్రస్తుతం ముళ్ల పొదలు పెరిగాయి. ఆరో జోన్‌లో నీటిపారుదల అధికారులు పూర్తిస్థాయిలో లేకపోవడానికి తోడు అధికారుల పదవీ విరమణలతో అంతా ఇన్‌ఛార్జిల పాలన సాగుతోంది.

అధికారులు చొరవ చూపితేనే : నీటి వనరులు ఉన్నప్పటికీ పొలాల వరకు నీటిని తీసుకొచ్చే ప్రక్రియలో లోపాలు సరిచేయాల్సి ఉంది. ఈ దిశగా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టిసారించాలని రైతులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.