close

గురువారం, జనవరి 23, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

తక్షణ స్పందన..

మహిళలకు అండగా నిలుస్తున్న ‘షీ’ బృందాలు
కనువిప్పు కలిగేలా నిందితులకు కఠిన శిక్షలు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: మీ మధ్యే ఉంటారు.. మీరు చెప్పకున్నా మీ బాధను వింటారు.. అక్కడికక్కడే అల్లరిమూకల పనిపడతారు.. మీరు ఒంటరిగా ఉంటే ఒక్క ఫోన్‌కాల్‌తో మీకు వెన్నంటి ఉంటాయి.. వేధించే ఆకతాయిల ఆటకట్టిస్తాయి ‘షీ’ బృందాలు. ఆపదలో ఉన్నవారికోసం తక్షణమే స్పందిస్తూ బాధితులకు సాంత్వన కలిగిస్తున్నాయి. గత మూడునెలల పరిధిలో హైదరాబాద్‌ షీ బృందాలు 360మంది మహిళా ఫిర్యాదుదారులకు అండగా నిలిచాయి. నిందితులను అరెస్టు చేసి 17మందికి జైలు శిక్షలు, మరో 36మందికి జరిమానాలు విధించారు.

డయల్‌ 100: ఏదైనా ఆపదలో ఉన్నా.. ఆకతాయిలు వేధించినా 100కు డయల్‌ చేయడం ద్వారా ‘షీ’బృందాలను సంప్రదించొచ్చు. ఇదే కాకుండా సామాజిక మాధ్యమాల వేదికగా కూడా ఫిర్యాదు చేయొచ్చు. తక్షణ పరిష్కారం పొందొచ్చని చెబుతున్నారు నగర పోలీసులు.


నెలల వారీగా నమోదైన కేసుల వివరాలు..

సెప్టెంబర్‌లో..
* నగరంలో గణేష్‌ నిమజ్జనాల సమయంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టోలిచౌకి ప్రాంతానికి చెందిన మహ్మద్‌ జబేర్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసి 15రోజుల జైలుశిక్ష, రూ.250 జరిమానా విధించారు. అదేరోజు బోరబండ ప్రాంతానికి చెందిన సిరాజ్‌ అహ్మద్‌ అనే యువకుడికి 15రోజుల జైలు శిక్ష, రూ.250 జరిమానా విధించారు. అదేరోజు ఎన్టీఆర్‌ గార్డెన్‌ రోడ్‌లో మహిళల ఫొటోలు తీస్తున్న ముషీరాబాద్‌ ప్రాంతానికి చెందిన భాస్కర్‌ అనే యువకుడిని అరెస్టు చేసి 15రోజుల జైలు శిక్ష, రూ.250 జరిమానా విధించారు.
* చత్రినాక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ యువకుడు పరిచయస్థురాలైన ఓ యువతితో ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడటంతో పాటు ప్రేమించాలని వేధించడంతో అతన్ని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
* గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ యువకుడు పక్కింట్లో ఉండే ఓ యువతిని మానసికంగా, శారీరకంగా వేధించడంతో షీ టీమ్‌ ఆ యువకున్ని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
* సైఫాబాద్‌లోని నిజాం క్లబ్‌లో మహిళా భద్రత విభాగంలో పనిచేస్తున్న ఓ మహిళ పట్ల అదే క్లబ్‌లో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు జమీల్‌, ఖలీల్‌, ఉస్మాన్‌, షకీర్‌ ఖాసీమ్‌లు అనుచితంగా ప్రవర్తించడంతో వారిపై కేసులు నమోదు చేశారు.

అక్టోబర్‌లో..
* సామాజిక మాధ్యమాల్లో ఓ యువతిని వేధించిన విద్యార్థికి 5రోజుల జైలు శిక్ష విధించారు.
* 14ఏళ్ల వయసుగల కన్నకూతురిపై లైంగికదాడికి పాల్పడిన మహ్మద్‌ యూసుఫ్‌ అనే వ్యక్తికి నాంపల్లి అదనపు మెజిస్ట్రేట్‌ జీవితఖైదుతో పాటు రూ.2వేల జరిమానా విధించింది.

నవంబర్‌లో..
* మెహిదీపట్నంలోని గౌతమి కాలేజీ వద్ద ద్విచక్రవాహనంపై తిరుగుతున్న ఇద్దరు ఆకతాయిలను ‘షీ’ బృందం అదుపులోకి తీసుకుని నాలుగురోజుల జైలుశిక్ష విధించారు.
* సికింద్రాబాద్‌ ప్రాంతంలో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన తుమ్మ చంద్రశేఖర్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసి 8రోజుల జైలుశిక్ష విధించారు.
* సంతోష్‌నగర్‌ ప్రాంతంలో ముగ్గురు ఆకతాయిలు జమీల్‌, సల్మాన్‌ అలీ, ఒమర్‌ ఫయాజ్‌లను అరెస్టు చేసి 2రోజుల జైలు శిక్ష, రూ.రెండువందల జరిమానా విధించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.