close

సోమవారం, జనవరి 27, 2020

ప్రధానాంశాలు

రాష్ట్ర వార్తలు

నిజమైన కార్యకర్తలకు తగిన గుర్తింపు

● ఉప ముఖ్యమంత్రి నాని ●

డీసీసీబీ, డీసీఎంఎస్‌ పదవుల ప్రమాణ స్వీకరణ సభ

 

ప్రమాణ స్వీకారం చేస్తున్న కవురు శ్రీనివాస్‌, యడ్ల తాతాజీ

ఏలూరు వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: వైకాపాలో నిజమైన కార్యకర్తలకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని, వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అన్నారు. శనివారం సాయంత్రం ఏలూరులోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన డీసీసీబీ, డీసీఎంఎస్‌ పదవీ స్వీకరణ అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ పార్టీలో ఎన్నో ఏళ్లుగా కార్యకర్తలుగా కష్టపడి పనిచేసిన అందరికీ తగిన గుర్తింపు లభిస్తుందని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలుబెట్టుకున్నారని వివరించారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌ పర్సన్‌ ఇన్‌ఛార్జి ఛైర్మన్లుగా కవురు శ్రీనివాస్‌, యడ్ల తాతాజీలను నియమించడమే అందుకు నిదర్శనమన్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఛైర్‌పర్సన్లు, సభ్యులు సంక్షేమ కార్యక్రమాలను రైతుల వద్దకు తీసుకెళ్లేందుకు తమవంతు సహకారం అందిస్తామని వివరించారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ జిల్లాలో డీసీసీబీ ఛైర్‌పర్సన్‌ బాధ్యతలను బీసీలకు కల్పించడం నిజంగా ఒక చరిత్ర అన్నారు. స్థానిక ఎన్నికలకు కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని, అందరూ కష్టపడి పార్టీని గెలిపించాలని కోరారు. నూతన బాధ్యతలు స్వీకరించిన డీసీసీబీ ఇన్‌ఛార్జి ఛైర్‌పర్సన్‌ కవురు శ్రీనివాస్‌ మాట్లాడుతూ రైతులకు సేవలు అందించే భాగ్యాన్ని కల్పించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. డీసీఎంఎస్‌ ఇన్‌ఛార్జి ఛైర్‌పర్సన్‌ యడ్ల తాతాజీ మాట్లాడుతూ తాను ఎప్పుడు ఈ స్థాయికి వస్తానని అనుకోలేదని, ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. తొలుత కార్యాలయం ఆవరణలోని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఇన్‌ఛార్జి ఛైర్‌పర్సన్లకు, సభ్యులతో మంత్రులు ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఏలూరు, నరసాపురం, పార్లమెంటు సభ్యులు కోటగిరి శ్రీధర్‌, కనుమూరి రఘురామ కృష్ణంరాజు, శాసనసభ్యులు ఎలీజా, పుప్పాల శ్రీనివాస్‌, ముదునూరి ప్రసాదరావు, కారుమూరి నాగేశ్వరరావు తదితర ప్రజాప్రతినిధులు బ్యాంకు అధికారులతోపాటు జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.