close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

క్రైమ్

రైతు సమస్యల పరిష్కారానికే దీక్ష

● రేపు కాకినాడలో రోజంతా దీక్ష ●

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌


కాకినాడలో గోడప్రతులను ఆవిష్కరిస్తున్న జనసేన పార్టీ నాయకులు

ఈనాడు-అమరావతి: రైతు సమస్యలను జగన్‌రెడ్డి ప్రభుత్వానికి బలంగా తెలియజేసేందుకే ఈ నెల 12న కాకినాడలో ఒక రోజు నిరాహార దీక్ష చేస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. 3 రోజుల్లో రైతు సొమ్ములు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరానని వివరించారు. 151 మంది ఎమ్మెల్యేలున్న వైకాపా ప్రభుత్వం అంతే బలంగా పనిచేయాల్సి ఉండగా రైతుల పట్ల కనీస స్పందన చూపడం లేదని ప్రకటనలో విమర్శించారు. స్వయంగా రైతు సమస్యలు తెలుసుకునేందుకు మండపేట పరిసర ప్రాంతాల్లో పర్యటించానని, వారి వేదనలు తనను కలచివేశాయని తెలిపారు. ‘వరి పంట వేసేందుకు భయపడేలా ప్రభుత్వ విధానాలున్నాయి. గిట్టుబాటు ధర లేక, ఖర్చులు కూడా రాబట్టుకోలేక వరి సాగు చేసిన రైతులు అప్పుల పాలవుతున్నారు. రాష్ట్రంలో ఏటా 50 లక్షల క్వింటాళ్ల ధాన్యం పండుతుండగా ఉభయగోదావరి జిల్లాల్లోనే సగం పండుతోంది. రానున్న రోజుల్లో ఈ పరిస్థితి కనుమరుగయ్యే దుస్థితి ఉంది’ అని పేర్కొన్నారు. ‘కౌలు రైతులకు రైతు భరోసా కల్పించడంలో కుల వివక్ష ఎందుకని రైతులు అడుగుతున్న ప్రశ్నలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. కులాలకతీతంగా రైతులందరికీ రైతు భరోసా వర్తింపజేయాలి. బియ్యం గింజకు లేని కులం పంట పండించేవారికి ఎందుకుని రైతులు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వ ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి. ధాన్యానికి కనీస మద్దతు ధరను రూ.2000 చేయాలి’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.