close

బుధవారం, ఆగస్టు 05, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ధరల మోత.. రాయితీ కోత!

పచ్చిరొట్టలపై రైతుల నిట్టూర్పు


సాగు చేసిన జనుము పంట

న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి : పైరు సాగుచేసే పొలం సారవంతంగా ఉండాలని రైతులు పచ్చిరొట్ట విత్తనాలైన జనుము, జీలుగ, పిల్లిపెసర సాగు చేస్తుంటారు. స్వల్ప కాలిక పంట పూర్తయ్యాక వీటిని భూమిలో కలియదున్నడంతో పచ్చిరొట్ట ఎరువుగా మారుతుంది. దిగుబడులు పెంచుకునేందుకు వీలుగా రైతులు ఏటా వీటి సాగుకు ఆసక్తి చూపుతుంటారు. జిల్లా వ్యాప్తంగా ఈ దఫా దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో రైతులు అవసరాన్ని బట్టి వ్యవసాయ శాఖ సూచనతో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ(ఏపీసీడ్స్‌) ప్రస్తుతానికి 8 వేల క్వింటాళ్లు నిల్వ ఉంచి.. ఆయా మండలాలకు ఇప్పటికే 2 వేల క్వింటాళ్ల మేరకు విత్తనాలు పంపిణీ చేసింది.

గతమెంతో ఘనం

రైతుల పరిస్థితి గతమెంతో ఘనంగాను, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నిరుడు పచ్చిరొట్ట విత్తనాలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం విత్తనాల కిలో అసలు ధరపై 75 శాతం రాయితీ ఇస్తూ వచ్చింది. కిలో నుంచి అంతకంటే ఎక్కువ తీసుకున్న వారందరికీ రాయితీ వర్తిస్తూ వచ్చేది. ఆ వివరాలను పరిశీలిస్తే..

నిబంధనలతో ఆవేదన

పచ్చిరొట్ట విత్తనాల సాగుకు రైతులు ఆసక్తి చూపుతుంటారు. వర్షాలు పడుతుండటంతో ఇప్పటికే వీటి విక్రయాలు జోరందుకోవాలి. ఇప్పటి వరకు అలాంటి దాఖలాలు లేవు. కారణం రాయితీని 75 శాతం నుంచి 50 శాతానికి తగ్గించడం, అందులోనూ 25 కిలోలు కొన్న రైతులకే 50 శాతం రాయితీ ఉండేలా నిబంధనలు పెట్టడంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారు.

జీలుగ కిలో రూ.60, జనుములు కిలో రూ.74, పిల్లిపెసర కిలో రూ.95 వంతున ధరలు నిర్ణయించారు. జిల్లా రైతులు ఎక్కువగా జనుము, జీలుగ సాగుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. అయిదు కిలోలు, అంతకంటే తక్కువ తీసుకున్న రైతులు పూర్తి ధరలు చెల్లించాల్సిందే. పది కిలోలు తీసుకుంటే కొంత మేర, పాతిక కిలోలు తీసుకుంటేనే 50 శాతం రాయితీ వర్తించే విధంగా ధరలు నిర్ణయించారు. ఈ కారణంగా సాగు విస్తీర్ణం ఆశించిన మేర విత్తనాలు అమ్ముడుపోయే అవకాశం ఉండదని అధికారులు భావిస్తుండం గమనార్హం.


 

మరిన్ని వార్తలు

చంద్రబాబు సవాల్‌కు భయపడిన వైకాపా: నాని

తిరుపతి(నగరం): రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని మార్చడంపై ప్రజాభిప్రాయం తెలుసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఎం.సుగుణమ్మ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజధాని మార్పు జరగలేదని, రాజకీయ దురుద్దేశంతోనే మూడు రాజధానులు తెరపైకి వచ్చాయని విమర్శించారు. సీఎం జగన్‌ రాజధాని విషయంలో ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. చిత్తూరు(జిల్లా పంచాయతీ): తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విసిరిన సవాల్‌కు వైకాపా భయపడిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, ఎమ్మెల్సీలు రాజసింహులు, గౌనివారి శ్రీనివాసులు అన్నారు.

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.