close

సోమవారం, ఆగస్టు 03, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

4 లక్షలకు చేరువలో విమాన ప్రయాణికులు

50 శాతం మేర సర్వీసుల పునరుద్ధరణ

విమానాశ్రయం లోపల

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌-19 ప్రబలి దేశవ్యాప్తంగా ప్రయాణాలు నిలిచిపోయిన తరుణంలో.. విమానయానానికి డిమాండ్‌ పెరిగింది. తక్కువ ధరలోనే ప్రయాణానికి వీలు కలగడంతో పెద్దఎత్తున వినియోగించుకుంటున్నారు. రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు బస్సులు అందుబాటులో లేవు. రైలు సర్వీసులు ఎక్కువగా నడవడం లేదు. దీని దృష్ట్యా విమాన ప్రయాణానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి క్రమేపీ సర్వీసులు, ప్రయాణికుల రాకపోకలు ఎక్కువయ్యాయి. సోమవారం నాటికి 4561 సర్వీసులు నడవగా.. 3,91,764 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. హైదరాబాద్‌కు వచ్చిన వారి కంటే ఇక్కడి నుంచి వెళ్లిన వారే ఎక్కువగా ఉండటం విశేషం. రైలు కంటే ప్రయాణ సమయం చాలా తక్కువ కావడంతో ఎక్కువగా కాంటాక్టు ఉండదని భావించి విమానయానానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
బలపడిన నమ్మకం
లాక్‌డౌన్‌తో రెండు నెలల విరామం తర్వాత మే 25వ తేదీ నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభించేందుకు పౌర విమానయాన శాఖ అనుమతించింది. తొలుత 15శాతం విమాన సర్వీసులను అనుమతించింది. తర్వాత 30శాతానికి పెంచగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 50శాతానికి చేరుకుంది. సర్వీసులు ప్రారంభించిన తొలిరోజున పెద్దగా స్పందన రాలేదు. కేవలం 39 సర్వీసులు మాత్రమే రాకపోకలు సాగించాయి. థర్మల్‌ స్క్రీనింగ్, తాకకుండా తనిఖీలు చేయడం, బోర్డింగ్‌ పాస్‌లు తీసుకోవడం, బ్యాగేజీ శానిటైజ్‌ చేయడం, భౌతిక దూరం నిబంధనలు విధించడం, ప్రయాణికులకు ఫేస్‌షీల్డ్సు అందించడం.. ఇలా వివిధ చర్యలతో విమానప్రయాణంపై నమ్మకం బలపడింది. ప్రస్తుతం రోజుకు 120 సర్వీసులు శంషాబాద్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. తొలుత రోజుకు 3వేల మందిగా ఉన్న ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతం 12వేలకు చేరుకుంది. దేశంలోని 40 ప్రధాన గమ్యస్థానాలకు హైదరాబాద్‌ నుంచి విమానాలు నడుస్తున్నాయి
ఇప్పటి వరకు శంషాబాద్‌ నుంచి విమానాలు, ప్రయాణికుల రాకపోకల వివరాలు
విమానాలు వచ్చినవి         2280
వెళ్లినవి                     2281
ప్రయాణికులు వచ్చిన వారు   1,88,420
వెళ్లిన వారు                 2,03,344

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.