close

సోమవారం, ఆగస్టు 03, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘హైజెనిక్‌’గా దోచేస్తున్నారు

రెట్టింపు ధరలకు రిటైల్‌ అమ్మకాలు
కరోనా వేళ కూరగాయల ధరలకు రెక్కలు
ఈనాడు - హైదరాబాద్‌

కరోనా వేళ తాజా కూరగాయలు, పండ్ల అవసరం మరింత ఏర్పడింది. అయితే నగరంలో పరిస్థితులు అందుకు అనువుగా లేవు. కరోనా భయంతో రైతుబజార్లకు వెళ్లలేని పరిస్థితి. కరోనా వేళ వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ రంగంలోకి దించిన సంచార రైతుబజారు వాహనాలు కూడా ఇప్పుడు కాలనీల్లో కనిపించని పరిస్థితి. దీంతో కాలనీల్లోని రిటైల్‌ దుకాణదారులు, సూపర్‌బజార్ల నిర్వాహకులు దోపిడీకి శ్రీకారం చుట్టారు. హైజెనిక్‌గా దుకాణాలు నిర్వహిస్తున్నామని చెప్పి.. అంతే హైజెనిక్‌గా దోచుకుంటున్నారు.
సొమ్ము చేసుకుంటున్నారు
హోల్‌సేల్‌ మార్కెట్‌లో కూరగాయలను తెచ్చిన దుకాణదారులు రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. బెండకాయ కిలో ధర హోల్‌సేల్‌ మార్కెట్లో రూ.12 ఉంటే.. రైతుబజార్లలో రూ. 15 చొప్పున అమ్ముతున్నారు. సూపర్‌ బజార్లు, కాలనీల్లోని కూరగాయల దుకాణాల్లో రూ. 35 నుంచి 39 వరకూ అమ్మేస్తున్నారు. మిరపకాయలు కిలో రూ. 38 ఉంటే.. రైతుబజారులో రూ. 48 చొప్పున అమ్ముతున్నారు. అదే మిర్చీ సూపర్‌మార్కెట్లకు వచ్చేసరికి రూ. 75కి పైగా అమ్ముతున్నారు. కిలో టమాటా లోకల్‌ అయితే రూ. 52, హైబ్రీడ్‌ అయితే రూ. 55 చొప్పున సూపర్‌మార్కెట్లలో అమ్ముతున్నారు. అదే హోల్‌సేల్‌ మార్కెట్లో రూ. 40 చొప్పున, రైతుబజారులో రూ. 42కు దొరుకుతోంది. ఇలా టమాటా తప్పిస్తే.. మిగతా కూరగాయలన్నీ కొన్ని చోట్ల రెట్టింపు ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.
కానరాని సంచార రైతుబజారు వాహనాలు..
నగరంలో 12 రైతు బజార్లున్నాయి. కరోనా వేళ వ్యవసాయ మార్కెటింగ్‌ అధికారులు సంచార రైతుబజారు వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రతి రైతుబజారు నుంచి 15 వాహనాలను తొలుత పంపారు. అంతేకాదు ఫోను చేస్తే కాలనీకి కూరగాయల బండి వస్తుందన్నారు. ఏప్రిల్, మే నెలల వరకూ ఈ వ్యవస్థ బాగానే పని చేసింది. తర్వాత ఫోను పలకడంలేదు.. కాలనీలకు కూరగాయల బండ్లు రావడంలేదు. కరోనా భయంతో కొన్ని మార్కెట్లు బంద్‌ అయ్యాయి.  దీంతో కాలనీల్లోని కూరగాయల దుకాణదారులు, సూపర్‌ మార్కెట్ల నిర్వాహకులు రెట్టింపు ధరలకు అమ్ముకుంటున్నారు.  
రైతుకు అందని లాభాలు..
కరోనా కాలంలో ఎవరూ కూరగాయలు కొనడంలేదని చెప్పి రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న సూపర్‌ మార్కెట్‌ నిర్వాహకులు, దళారులు.. నగరానికి తెచ్చిన తర్వాత అధిక ధరలకు అమ్ముతున్నారు. నగరంలోని హోల్‌సేల్‌ మార్కెట్‌కు.. రైతు బజారుకు 20 నుంచి 25 శాతం అధిక ధరలకు అమ్ముకోవచ్చని మార్కెటింగ్‌ శాఖే అనుమతిచ్చింది. ఇక సూపర్‌ బజార్ల వాళ్లపైన అయితే ఆ నియంత్రణ కూడా లేదు. దీంతో రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.