close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

ప్రధానాంశాలు

కనుల పండువగా బొమ్మల కొలువు ఉత్సవం

సెంటినరీకాలనీ, న్యూస్‌టుడే: సెంటినరీకాలనీలోని సీఎన్‌సీఓఏ మహిళా క్లబ్‌ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బొమ్మల కొలువు ఉత్సవం కనువిందు చేసింది. సంక్రాంతి వేడుకల్లో భాగంగా క్లబ్‌ ప్రతి ఏడాది ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా క్లబ్‌ సభ్యులు సంక్రాంతి పర్వదిన ప్రాధాన్యం, గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కళాకృతులు, బొమ్మల ప్రదర్శనలతో సృజనాత్మకతను చాటుకొన్నారు. క్లబ్‌ గౌరవ అధ్యక్షురాలు వసంతలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ ఉత్సవానికి ఆర్జీ-1,2 క్లబ్‌ గౌరవ అధ్యక్షురాళ్లు పద్మ, ఆశ హాజరై మాట్లాడారు. కనుమరుగవుతున్న పల్లె సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వారు పేర్కొన్నారు. సివిల్‌ ఏజీఎం పద్మశ్రీ, సీఎన్‌సీ క్లబ్‌ కార్యదర్శి నళిని, ఆర్జీ-2 క్లబ్‌ కార్యదర్శి జయశ్రీ, సంయుక్త కార్యదర్శి సుప్రియ, కోశాధికారి ప్రసన్న, క్రీడల కార్యదర్శి గౌరి, సాంస్కృతిక విభాగం కార్యదర్శులు విజయ, లావణ్య, సభ్యులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.