close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

ప్రధానాంశాలు

రసవత్తరంగా కబడ్డీ పోటీలు

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న కబడ్డీ అసోసియేషన్‌

జిల్లా అధ్యక్షుడు బానోత్‌ హరిసింగ్‌నాయక్‌

ఇల్లెందు, న్యూస్‌టుడే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మంగళవారం రసవత్తరంగా సాగాయి. లీగ్‌ దశలో భాగంగా రాష్ట్రంలోని 33జిల్లాల నుంచి వచ్చిన పురుషుల, స్త్రీల జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. రాష్ట్ర స్థాయి పోటీలు కావడంతో క్రీడాకారులు వారి సత్తాను చాటారు. పాయింట్లు సాధించేందుకు ప్రదర్శన కనబర్చారు. క్రీడాకారుల సౌకర్యార్థం కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాటు చేశారు. తాగునీటి, మరుగుదొడ్లు, టెంట్లు, వైద్య సదుపాయాలు కల్పించారు. పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున క్రీడాభిమానులు తరలివచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న లీగ్‌ దశల అనంతరం పూల్‌ దశలు ఆడాల్సి ఉంది.

పురుషుల జట్ల పోటీల వివరాలు..

● భద్రాద్రి కొత్తగూడెం- వరంగల్‌ రూరల్‌ జిల్లాల మధ్య జరిగిన పోటీలో భద్రాద్రి కొత్తగూడెం గెలుపొందింది. ● ఖమ్మం-వికారాబాద్‌ జిల్లాల మధ్య జరిగిన పోటీలో ఖమ్మం విజయం సాధించింది. ● పెద్దపల్లి-మహాబూబ్‌నగర్‌ జిల్లాల మధ్య జరిగిన పోటీలో మహాబూబ్‌నగర్‌ జయకేతనం ఎగురవేసింది. ● రంగారెడ్డి-భువనగిరి జిల్లాల మధ్య జరిగిన పోటీలో రంగారెడ్డి పైచేయి సాధించింది. ● నాగర్‌కర్నూల్‌-యాదాద్రి జిల్లాల మధ్య జరిగిన పోటీలో నాగర్‌కర్నూల్‌ను విజయం వరించింది. ● వరంగల్‌ అర్బన్‌- కామారెడ్డి జిల్లాల మధ్య జరిగిన పోటీలో వరంగల్‌ అర్బన్‌ విజయభేరి మోగించింది. ● సిద్దిపేట, ములుగు జిల్లాల మధ్య జరిగిన పోటీలో సిద్దిపేట గెలుపొందింది. ● వనపర్తి- రాజన్న సిరిసిల్ల జిల్లాల మధ్య జరిగిన పోటీలో రాజన్న సిరిసిల్ల విజయం సాధించింది. ● ఆసిఫాబాద్‌-సూర్యాపేట జిల్లాల మధ్య జరిగిన పోటీలో సూర్యాపేట జయకేతనం ఎగురవేసింది. ● సంగారెడ్డి-పెద్దపల్లి జిల్లాల మధ్య జరిగిన పోటీలో సంగారెడ్డి పైచేయి సాధించింది. ● గద్వాల్‌-నల్గొండ జిల్లాల మధ్య జరిగిన పోటీలో గద్వాల్‌ను విజయం వరించింది. ● నిజామాబాద్‌-భూపాలపల్లి జిల్లాల మధ్య జరిగిన పోటీలో నిజామాబాద్‌కు విజయం దక్కింది. ● మెదక్‌-మంచిర్యాల జిల్లాల మధ్య జరిగిన పోటీలో మెదక్‌ విజయభేరి మోగించింది. ● జగిత్యాల-హైదరాబాద్‌ జిల్లాల మధ్య జరిగిన పోటీలో హైదరాబాద్‌ గెలుపొందింది. ● రంగారెడ్డి-మహబూబాబాద్‌ జిల్లాల మధ్య జరిగిన పోటీలో మహబూబాబాద్‌ విజయం సాధించింది.

కబడ్డీ ఆడుతున్న మహిళల జట్లు

మహిళల జట్ల పోటీల వివరాలు

● భద్రాద్రి కొత్తగూడెం-మహాబూబ్‌నగర్‌ జిల్లాల మధ్య జరిగిన పోటీలో భద్రాద్రి కొత్తగూడెం గెలుపొందింది. ● సిద్దిపేట-వరంగల్‌ రూరల్‌ జిల్లాల మధ్య జరిగిన పోటీలో వరంగల్‌ రూరల్‌ విజయం సాధించింది. ● సూర్యాపేట- జగిత్యాల జిల్లాల మధ్య జరిగిన పోటీలో సూర్యాపేట జయకేతనం ఎగురవేసింది. ● నల్గొండ- నాగర్‌కర్నూల్‌ జిల్లాల మధ్య జరిగిన పోటీలో నల్గొండకు విజయం దక్కింది. ● సిరిసిల్ల-జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల మధ్య జరిగిన పోటీలో జయశంకర్‌ భూపాలపల్లిని విజయం వరించింది. ● రంగారెడ్డి-గద్వాల్‌ జిల్లాల మధ్య జరిగిన పోటీలో రంగారెడ్డి జయభేరి మోగించింది. ● కామారెడ్డి-భువనగిరి జిల్లాల మధ్య జరిగిన పోటీలో కామారెడ్డి గెలుపొందింది. ● హైదరాబాద్‌-మహబూబాబాద్‌ జిల్లాల మధ్య జరిగిన పోటీలో హైదరాబాద్‌ పైచేయి సాధించింది. ● మేడ్చల్‌-నిర్మల్‌ జిల్లాల మధ్య జరిగిన పోటీల్లో మేడ్చల్‌ జయకేతనం ఎగురవేసింది. ● ఖమ్మం-వరంగల్‌ అర్బన్‌ జిల్లాల మధ్య జరిగిన పోటీలో వరంగల్‌ అర్బన్‌ గెలుపొందింది. ● సంగారెడ్డి-ములుగు జిల్లాల మధ్య జరిగిన పోటీలో సంగారెడ్డి గెలిచింది. ● పెద్దపల్లి-మెదక్‌ జిల్లాల మధ్య జరిగిన పోటీలో మెదక్‌ను విజయం వరించింది. ● నిజామాబాద్‌-భువనగిరి జిల్లాల మధ్య జరిగిన పోటీలో భువనగిరి గెలుపొందింది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.