ఉల్లింత.. తుళ్లింత - Kurnool - EENADU
close

మంగళవారం, సెప్టెంబర్ 17, 2019

తాజా వార్తలు

ఉల్లింత.. తుళ్లింత

 అమాంతం పెరుగుతున్న ధర

కర్నూలు పాతనగరం, న్యూస్‌టుడే : గత మూడేళ్లుగా అంతంతమాత్రంగానే ఉన్న ఉల్లి ధర ప్రస్తుతం ఆశాజనంగా ఉంది. రోజురోజుకు ధరలు పెరుగుతుండటంతో అన్నదాతల్లో ఆనందం నెలకొంది. గతంలో కనీసం పెట్టుబడులు రాని దుస్థితితో కన్నీళ్లు పెట్టించిన ఉల్లి ప్రస్తుతం కాసులు కురిపిస్తోంది. రెండు రోజుల కిందట క్వింటా గరిష్ఠంగా రూ.2,900 పలకడం విశేషం. మహారాష్ట్రలో పెద్దఎత్తున వరదలు సంభవించడంతో పంట దెబ్బతింది. సరకు తక్కువగా వస్తుండడంతో ఉల్లికి విపణిలో మంచి ధర పలుకుతోంది. ఇదే అదునుగా బోరు బావుల కింద సాగు చేసిన రైతులు ముందే పంటను తొలగించి మార్కెట్‌కు దిగుబడులను తీసుకొస్తున్నారు. కర్నూలు వ్యవసాయ విపణిలో శనివారం కనిష్ఠ ధర రూ.1,360.. గరిష్ఠ ధర రూ.2,660 పలకడం విశేషం.

సాగు తగ్గి.. : ఉల్లి సాగులో రాష్ట్రంలో కర్నూలు జిల్లాదే ప్రథమస్థానం. జిల్లాలో సాధారణ సాగు 16 వేల హెక్టార్లు కాగా.. నీటి వసతి ఉన్న భూముల్లో దాదాపు 9 వేల హెక్టార్లలో సాగైనట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగు విస్తీర్ణం తగ్గడంతో మార్కెట్‌కు ఉల్లి దిగుబడులు తక్కువగా వస్తున్నాయి. ధరలు సరిగా లేకపోవడం.. నష్టాలు వస్తుండటంతో ఈ ఏడు చాలామంది రైతులు ఉల్లి సాగు చేపట్టలేదు. దీనికితోడు మహారాష్ట్రలోని నాసిక్‌ తదితర ప్రాంతాల్లో ఉల్లి నీటి మునిగి దిగుబడులు చేతికి రాలేదు. వినియోగం ఎక్కువగా ఉండడం.. సరకు తక్కువగా ఉండడంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి. వ్యాపారులు కొనుగోళ్లకు పెద్దఎత్తున ఆసక్తి చూపుతుండడంతో అన్నదాతల్లో ఆనందం నెలకొంది. * ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు తుంగభద్ర, కృష్ణా నదులకు పెద్దఎత్తున వరద రావడంతో అధికారులు పంట కాలువలకు నీటిని వదిలారు. బోరు బావుల్లోనూ భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో ఉల్లి సాగుకు కర్షకులు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో రూ.150 ఉన్న కూలీ ప్రస్తుతం రూ.200 నుంచి రూ.250 వరకు పెరగడం గమనార్హం. ఉల్లి నారుకు సైతం రెక్కలొచ్చాయి. ధరలు బాగా పలుకుతుండటంతో చాలామంది మరోసారి ఉల్లి సాగుపై దృష్టి సారించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.