మంగళవారం, డిసెంబర్ 10, 2019
మహానంది: జిల్లాలోని ప్రసిద్ధ మహానంది దేవస్థాన కార్యాలయంలో గురువారం కర్నూల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆసస్మికంగా తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆడిట్ అధికారి షణ్ముగగణేష్, సీఐ శ్రీధర్లు దస్త్రాలు పరిశీలిస్తున్నారు. ఇందులో దసరా, ఉగాది, మహాశివరాత్రి వంటి ముఖ్య పండగల సమయంలో చేసిన జమ, ఖర్చులపై ఆరా తీస్తున్నారు. అదే విధంగా గుత్తేదారులు దక్కించుకున్న టెండర్ల జమలు, బకాయిలు వంటి అంశాలను, భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల లేక్కలు చేస్తున్నారు. దాతలు విరాళంగా సమర్పించిన కానుకలు, వాటికి సంబంధించిన రసీదులను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలను నిశిత పరిశీలన అనంతరం తెలియజేస్తామన్నారు. ఈ తనిఖీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు