close

గురువారం, డిసెంబర్ 12, 2019

తాజా వార్తలు

సమావేశాలు.. సమాలోచనలు!

ఆర్టీసీ కార్యాచరణకు వేదికైన నగరం
సంఘాల వారీ విడివిడిగా సమావేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఎల్‌బీనగర్‌, కర్మన్‌ఘాట్‌, న్యూస్‌టుడే: ఆర్టీసీ సమ్మె కొనసాగించాలా..? విరమించాలా..? సమ్మె విషయంలో మీరేమంటారు..? మీ నిర్ణయానికి మేం కట్టుబడి ఉన్నామంటూ ఆర్టీసీ సంఘాల నాయకులు వేర్వేరుగా సమావేశమై కార్మికుల అభిపాయాలను తెలుసుకున్నాయి. దీంతో ఆర్టీసీ ఉద్యమానికి.. భవిష్యత్తు కార్యక్రమానికి నగరం మరోసారి వేదికయ్యింది. నగర శివార్లలోని ఫంక్షన్‌ హాళ్లలో ఉదయం 10 గంటల నుంచి జరిగిన సమావేశాలు.. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగాయి. మీడియానూ బయటకు పంపించి సుదీర్ఘంగా చర్చించడమే కాకుండా.. వేదికపైకి ఆహ్వానించి వారి అభిప్రాయాలను కార్మిక సంఘాళ రాష్ట్ర నాయకులు సేకరించారు. అనంతరం ఆర్టీసీ ఐకాస సమావేశమై.. వివిధ సంఘాల అభిప్రాయాలను తెలుసుకుంది.

టీఎంయూ సమావేశానికి భారీగా హాజరు..
తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ కేంద్రకమిటీ సమావేశం ఎల్బీనగర్‌ చౌరస్తా సమీపంలోని హిమగిరి గార్డెన్స్‌లో మంగళవారం పెద్ద ఎత్తున జరిగింది. తెలంగాణ అన్ని జిల్లాల యూనియన్‌ తరఫున డిపో కార్యదర్శులు, కార్మికులు హాజరై చర్చించారు. అన్ని జిల్లాల యూనియన్‌ ప్రతినిధుల అభిప్రాయాల సేకరణ చేశారు. అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. దయచేసి మీడియా మిత్రులు ఎవరూ ఉండకూడదని, ఇది మా అంతర్గత సమావేశమని అన్నారు. కాస్సేపు మీడియా ఉన్నప్పటికీ... ప్రస్తుతం అభిప్రాయ సేకరణ జరుగుతోందని, త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని దయచేసి గమనించాలనడంతో మీడియా బయటకేసి నడిచింది. ఈ కార్యక్రమంలో ఆ సంఘ అధ్యక్షుడు తిరుపతి, వర్కింగ్‌ అధ్యక్షుడు థామస్‌రెడ్డి, ప్రతినిధులు బి.ఆర్‌.రెడ్డి, మారయ్య, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు సాధించుకుందాం...
సీఎం మెడలు వంచైనా సరే ఆర్టీసీ కార్మికుల సమస్యలు సాధించుకుందామని ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు నరసింహన్‌ అన్నారు. ఆర్టీసీ ఐకాస సమ్మె కొనసాగింపు కార్యాచరణపై ఎంప్లాయీస్‌ యూనియన్‌ సాగర్‌ రింగ్‌ రోడ్డులోని కేకే గార్డెన్‌లో సమవేశమైంది. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ కొనసాగింది. కార్మికులకు న్యాయపరంగా రావాల్సిన పీఎఫ్‌ను ఆయా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుంటే కేంద్రం స్థాయిలో ఆందోళన చేపట్టి రాబట్టుకుంటామని తెలిపారు. ఆర్టీసీ ఐకాస ఏ పిలుపు ఇచ్చిన ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు అందిస్తుందని తెలిపారు. సడక్‌ బంద్‌, జైల్‌బరో, ప్రగతి భవన్‌ ముట్టడి కార్యక్రమాలను ఇతర కార్మిక సంఘాలతో చర్చించి భవిష్యత్‌ ప్రణాళిక ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ప్రతినిధులు గోపాల్‌, రాఘవ, సులోచన, జ్యోతి, బాల్‌రాజ్‌, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.