close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

తాజా వార్తలు

బియ్యం బాగలేకపోతే మీరేం చేశారు

వివరణ ఇవ్వాలని ప్రధానోపాధ్యాయుడికి ఆర్డీఓ ఆదేశం

 

బషీరాబాద్‌, న్యూస్‌టుడే: పురుగులు పట్టి, ముక్కిపోయిన బియ్యం వస్తే మీరేం చేశారు? నాణ్యత లేని బియ్యాన్ని పక్కన పెట్టి బాగున్న బియ్యంతో అన్నం చేయించొచ్చు కదా.. పిల్లలకు రుచికరమైన, నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆర్డీఓ వేణుమాధవరావు, ప్రధానోపాధ్యాయులు కిష్టప్పను ఆదేశించారు. ఈ విషయమై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని సూచించారు. బషీరాబాద్‌ బాలుర ఉన్నత పాఠశాలలో నాణ్యమైన బియ్యం సరఫరా కాకపోవడంతో ‘ముద్దగా మారి ముద్ద దిగక’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన తాండూరు ఆర్డీఓ వేణుమాధవరావు గురువారం పాఠశాలను సందర్శించి నిల్వ ఉన్న బియ్యాన్ని పరిశీలించారు. ఎంఈఓ సుధాకర్‌రెడ్డి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలలో దస్త్రాలను పరిశీలించి, ఓ ఉపాధ్యాయులు రెండు సంతకాలు ఉదయమే పెట్టడం ఏమిటని ప్రధానోపాధ్యాయుడిని ప్రశ్నించారు. మధ్యాహ్న భోజనం కోసం వచ్చిన కొన్ని బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారి బిచ్చయ్య సేకరించి తీసుకెళ్లారు.

బషీరాబాద్‌లో మధ్యాహ్న భోజనం చేస్తున్న ఆర్డీఓ వేణుమాధవరావు, ఎంఈఓ సుధాకర్‌రెడ్డి

ఓటరు సవరణ వేగవంతం చేయాలి

ఓటరు నజర్‌ నక్ష పనులు వేగవంతం చేయాలని బీఎల్‌ఓలను ఆర్డీవో వేణుమాధవరావు ఆదేశించారు. బీఎల్‌ఓలు గ్రామాల్లో పర్యటించి ఓటర్ల మార్పులు, చేర్పులకు సంబంధించి స్పష్టంగా వివరాలు సేకరించి నమోదు చేయాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న 15 మంది బీఎల్‌ఓలకు తాఖీదులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. తహసీల్దార్‌ కార్యాలయాలకు వచ్చే రైతులు, ఆర్జీదారులకు ఇబ్బందులు పెట్టకుండా నిర్ణీత సమయంలో పనులు చేసివ్వాలన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.