close

సోమవారం, జనవరి 27, 2020

తాజా వార్తలు

‘దిశ ఘటనలో పోలీసుల చర్య చట్టవిరుద్ధం’


మాట్లాడుతున్న పీవోడబ్ల్యూ రాష్ట్ర కోశాధికారి రాయల జ్యోతి

టేకులపల్లి, న్యూస్‌టుడే: దిశ ఘటన నిందితులకు పోలీసులు విధించిన శిక్ష చట్ట విరుద్ధమని పీవోడబ్ల్యూ రాష్ట్ర కోశాధికారి రాయల జ్యోతి అన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) జిల్లా కార్యవర్గ సమావేశం శనివారం టేకులపల్లిలో ఆ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షురాలు నోముల కళావతి నివాసంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దిశపై అత్యాచారం చేసిన నిందితులను పోలీసులు ప్రతిస్పందన పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చట్టవ్యతిరేక చర్యకు పాల్పడ్డారని విమర్శించారు. ఈ సంఘటనతో ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లిందని ఆమె అభిప్రాయపడ్డారు. దిశ సంఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత చట్టాలు అమలు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు కల్తి రాములమ్మ, జిల్లా కోశాధికారి గీతా, జిల్లా కమిటీ సభ్యులు సుగుణ, లక్ష్మి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.