కళ్లలో కారం కొడతాడు.. ఆభరణాలు కొల్లగొడతాడు - Hyderabad - EENADU
close

గురువారం, సెప్టెంబర్ 19, 2019

తాజా వార్తలు

కళ్లలో కారం కొడతాడు.. ఆభరణాలు కొల్లగొడతాడు

దొరికిన ఘరానా దొంగ

పేట్‌బషీరాబాద్‌, న్యూస్‌టుడే: ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలే లక్ష్యంగా వారి కళ్లలో కారం చల్లి మంగళసూత్రాల చోరీకి పాల్పడుతున్న ఓ పాత నేరస్థుడిని మేడ్చల్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. బాలానగర్‌ జోన్‌ డీసీపీ పీవీ పద్మజ పేట్‌బషీరాబాద్‌ ఠాణాలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

హర్యానాకు చెందిన బోద్‌ అమర్‌సింగ్‌ (33) అలియాస్‌ అమర్‌ ఘట్‌కేసర్‌ మండలం ప్రతాప్‌సింగారంలో నివసిస్తుంటాడు. ఇతని తండ్రి మహవీర్‌ సింగ్‌ దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌లో 4వ తరగతి ఉద్యోగిగా చేసి పదవీ విరమణ పొందాడు. తల్లి అనారోగ్యానికి గురైంది. చేస్తున్న మేతరి పనితో కుటుంబం గడవటం లేదు. దీంతో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకొని కళ్లలో కారం పొడి చల్లి వారి మెడలోంచి మంగళసూత్రాల దొగతనాల బాటపట్టాడు. 2009లో అల్వాల్‌ ఠాణా పరిధిలో మంగళసూత్రం చోరీ చేసిన రెండు కేసుల్లో ఏడాది పాటు జైలుశిక్ష అనుభవించాడు. జైలు నుంచి బయటకు వచ్చినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. పోలీసులకు అనుమానం రాకుండా తన మకాంను లోతుకుంటకు మార్చాడు. ఇటీవల కాలంలో పాత నేరస్థులపై పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో లోతుకుంటలో పోలీసులు అమర్‌సింగ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. చోరీ చేసిన బంగారు గొలుసును మార్వాడీ కొట్టులో తాకట్టు పెట్టేందుకు వెళ్తున్నట్లు విచారణలో అంగీకరించాడు. ఈ ఏడాది మార్చి 18న మేడ్చల్‌ ఠాణా పరిధిలో చైన్‌ స్నాచింగ్‌కు, అల్వాల్‌ ఠాణా పరిధిలలో రెండు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకొన్నాడు. నిందితుడి వద్ద నుంచి సుమారు 7.3 తులాల మూడు బంగారు పుస్తెలతాళ్లు స్వాధీనం చేసుకొన్నారు. నిందితుడి విషయమై ఎలాంటి ఆధారం లేకున్నా మూడు కేసులను ఛేదించిన పోలీసులను డీసీపీ అభినందించారు. సమావేశంలో పేట్‌బషీరాబాద్‌ ఏసీపీ ఏవీఆర్‌ నర్సింహరావు, పేట్‌బషీరాబాద్‌ డీఐ ఎస్‌.సంతోశం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.