close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఉప సమరం.. ప్రతిష్ఠాత్మకం

17 రాష్ట్రాల్లో ఎన్నికలు
ఉత్తర్‌ప్రదేశ్‌లో రసవత్తర పోరు

దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబరు 5న, మిగతా చోట్ల 51 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోక్‌సభ స్థానాలకు ఈనెల 21న పోలింగ్‌ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కర్ణాటకలో డిసెంబరు 9న, మిగతా ప్రాంతాల్లో ఈనెల 24న నిర్వహిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల ఎన్నికలతో పాటే అనేక రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోరుకు కూడా తెర లేచింది. ఉప ఎన్నికలే అయినప్పటికీ ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికార భాజపాతో పాటు, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), కాంగ్రెస్‌లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో రాజకీయాలు వేడెక్కాయి. 2022లో జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయా పార్టీలు బరిలోకి దిగుతున్నాయి. మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉండగా ఒకటి (తుండ్లా) మినహా అన్నిచోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 11 స్థానాలకు గాను 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 9 భాజపా, ఒక్కొక్కటి వంతున బీఎస్పీ (జలాల్‌పుర్‌), ఎస్పీ (రామ్‌పుర్‌)లు గెలుపొందాయి. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో భాజపా ఎమ్మెల్యేలు పలువురు గెలుపొందడంతో ఎక్కువ స్థానాలు ఖాళీ అయ్యాయి. అలాగే ఫగూసింగ్‌ చౌహాన్‌ బిహార్‌ గవర్నర్‌గా నియమితులు కావడంతో ఘోసీ స్థానం ఖాళీ అయింది. రామ్‌పుర్‌ ఎమ్మెల్యే మహ్మద్‌ ఆజామ్‌ ఖాన్‌(ఎస్పీ) ఎంపీగా గెలుపొందడంతో ఆ స్థానం ఖాళీ అయింది.

భాజపా  ప్రధాని మోదీకి ఉన్న ప్రజాదరణను ఉపయోగించుకుంటూ.. రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వానికి బలమైన పట్టు ఉందని నిరూపించుకోవాలన్నది భాజపా యోచన. కనీసం 10 స్థానాల్లో గెలుపొందాలన్న లక్ష్యంతో వ్యూహరచన చేస్తోంది. ప్రతిపక్షాలన్నీ వేర్వేరుగా పోటీ చేస్తుండటం కూడా భాజపాకు కలిసిరావచ్చన్న అంచనాలున్నాయి.
బీఎస్పీ సాధారణంగా ఉప ఎన్నికల్లో పోటీచేయడానికి అంత సుముఖంగా ఉండని బీఎస్పీ ఈసారి బరిలోకి దిగుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీతో కలిసి పోటీచేసిన ఆ పార్టీ ఈసారి ఒంటరిగా బరిలోకి దిగుతోంది. 2022 నాటికి ఎలాగైనా పట్టు సాధించాలన్న పట్టుదలతో బీఎస్పీ అధినాయకురాలు మాయావతి ఉన్నారు.
ఎస్పీ 2017, 19 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఎస్పీ, ఈ ఎన్నికల్లో గత వైభవాన్ని సాధించాలన్న పట్టుదలతో ఉంది. అఖిలేశ్‌ యాదవ్‌, ఇతర నేతలు పార్టీ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు.
కాంగ్రెస్‌ 2017లో ఎస్పీతో జట్టు కట్టిన కాంగ్రెస్‌ కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అమేఠీలో పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో ప్రచారానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రియాంక గాంధీని రంగంలోకి దించాలని భావిస్తోంది.

మహాపొత్తు
సీట్ల సర్దుబాటలో భాజపా-శివసేన

* కమలం  164
* సేన    124

 

ముంబయి, న్యూస్‌టుడే: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ (భాజపా), శివసేనల మధ్య పొత్తు ఖరారైంది. మరికొన్ని చిన్న పార్టీలతో కలిసి జట్టుగా బరిలోకి దిగుతున్నట్లు భాజపా మంగళవారం వెల్లడించింది. రెండు పార్టీలు తమ అభ్యర్థుల తొలి జాబితాలను కూడా విడుదల చేశాయి. సీట్ల సర్దుబాటు విషయంలో కొద్దిరోజులుగా ఇరు పార్టీల పొత్తుపై సందిగ్ధత నెలకొన్నప్పటికీ చివరికి కలిసే బరిలోకి దిగడానికి నిర్ణయించాయి. పొత్తు ఉంటుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌, శివసేన సీనియర్‌ నేత సుభాష్‌ దేశాయ్‌లు సోమవారం రాత్రే ప్రకటించినప్పటికీ.. ఆ సమయంలో సీట్ల పంపకం వివరాలేవీ వెల్లడించలేదు. కాగా రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఏ), రాష్ట్రీయ సమాజ్‌ పక్ష్, శివ్‌సంగ్రామ్‌ సంఘటన, రాయత్‌ క్రాంతి సేన వంటి చిన్న పార్టీలు కూడా పొత్తులో ఉన్నాయి. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలుండగా భాజపాకు 164, శివసేనకు 124 స్థానాలు కేటాయించారు. అయితే చిన్న పార్టీలకు మాత్రం భాజపాయే తన కోటాలోంచి సీట్లు కేటాయించాలని ఒప్పందం కుదిరింది. మొదటి నుంచి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే సహా ఇరుపార్టీల నేతలు భాజపా-శివసేన కూటమిగానే ఎన్నికల బరిలోకి దిగుతాయని ప్రకటిస్తూ వచ్చారు. అధికార కూటమి పొత్తు ఖరారు, ఆ వెంటనే అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో మహారాష్ట్రలో ఒక్కసారిగా ఎన్నికల కోలాహలం ఊపందుకుంది. మరోవైపు టిక్కెట్లు ఆశించి భంగపడిన నేతలు, వారి మద్దతుదారులు వ్యతిరేక గళం వినిపిస్తున్నారు.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో మొత్తం 36 అసెంబ్లీ స్థానాలకు గాను భాజపా-19, శివసేన-17 చోట్ల బరిలోకి దిగనున్నాయి.
* ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ నాగ్‌పుర్‌ సౌత్‌ వెస్ట్‌ నుంచి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ పుణెలోని కొత్రుద్‌ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ కుటుంబానికి చెందిన శివేంద్ర సింగ్‌ను సతారా నుంచి భాజపా పోటీకి నిలుపుతోంది.

125 భాజపా తొలి జాబితా

భాజపా 125 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఇందులో 12 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించింది. మాజీ మంత్రి, సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ ఖడ్సేకు తొలి జాబితాలో చోటు దక్కలేదు.

70 శివసేన తొలి జాబితా

శివసేన 70 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. శివసేన చరిత్రలోనే తొలిసారిగా.. ఠాక్రే కుటుంబం నుంచి పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు, యువసేన అధ్యక్షుడు ఆదిత్య ఠాక్రే ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. దక్షిణ ముంబయిలోని వర్లీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన ఈనెల 3న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

పంజాబ్‌ (4)

* ఫగ్వారా
* ముకేరియన్‌
* డాఖా
* జలాలాబాద్‌

హిమాచల్‌ప్రదేశ్‌ (2)

* ధర్మశాల
* పచ్ఛద్‌

ఉత్తర్‌ప్రదేశ్‌ (11)

* గంగోహ్‌
* రామ్‌పుర్‌
* ఇగ్లాస్‌
* లఖ్‌నవూ కంటోన్మెంట్‌
* గోవింద్‌నగర్‌
* మాణిక్‌పుర్‌
* ప్రతాప్‌గఢ్‌
* జైద్‌పుర్‌
* జలాల్‌పుర్‌
* బల్హా
* ఘోసీ

సిక్కిం (3)

* పోక్‌లోక్‌-కామ్‌రంగ్‌
* మార్తామ్‌-రుమ్‌టెక్‌
* గాంగ్‌టక్‌

గుజరాత్‌ (6)

* తారాడ్‌
* రాధన్‌పుర్‌
* ఖేరలూ
* బయాద్‌
* అమరైవాడీ
* లూనావాడా

మేఘాలయ (1)

* షెల్లా

ఒడిశా (1)

* బిజేపుర్‌

కర్ణాటక (15)

* అథణి
* కాగవాడ
* గోకాక్‌
* యెల్లాపుర్‌
* హిరేకరూరు
* రాణిబెన్నూరు
* విజయనగర
* చిక్కబళ్లాపుర
* కేఆర్‌పుర
* యశ్వంత్‌పుర
* మహాలక్ష్మి లే-అవుట్‌
* శివాజీనగర
* హోసకోటే
* క్రిష్ణరాజ్‌పేట
* హొణుసూరు

కేరళ (5)

* మంజేశ్వర్‌
* ఎర్నాకుళం
* వట్టియోర్కావు
* అరోర్‌
* కోనీ

బిహార్‌ (5+1)

* కిషన్‌గంజ్‌
* సిమ్రీ బఖ్తియార్‌పుర్‌
* దరౌండా
* నాథ్‌నగర్‌
* బెల్హార్‌
* సమస్తీపుర్‌ (లోక్‌సభ స్థానం)

తెలంగాణ (1)

* హుజూర్‌నగర్‌

తమిళనాడు (2)

* విక్రవాండి
* నాంగునేరి

పుదుచ్ఛేరీ (1)

* కామరాజ్‌ నగర్‌

అరుణాచల్‌ ప్రదేశ్‌ (1)

* ఖోన్సా

అసోం (4)

* రాటాబరీ 
* జనై
* రంగపారా 
* సోనారీ

ధ్యప్రదేశ్‌ (1)

* ఝాబువా

మహారాష్ట్ర సతారా (లోక్‌సభ స్థానం)
రాజస్థాన్‌ (2)

* మాండ్వా 
* ఖిన్వ్‌సర్

ఛత్తీస్‌గఢ్‌ (1)

* చిత్రకోట్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.