
భారత్ - అమెరికా సంబంధాలపై 14 ఏళ్ల క్రితమే బైడెన్ ప్రస్తావన
కలిసి ముందడుగుకు అవకాశం
వాషింగ్టన్: అగ్రరాజ్యాధినేతగా జో బైడెన్ ఎన్నిక కావడంతో భారత్-అమెరికా బంధాలు మరింత బలోపేతమై నవ శకం ప్రారంభయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. బైడెన్ ఇదివరకే ఇచ్చిన హామీలు, ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా విశ్లేషకులు ఈ మేరకు ఒక అభిప్రాయానికి వస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తరహాలో చైనా విషయంలో బైడెన్ దూకుడుగా వెళ్లకపోవచ్చని, అయితే అమెరికాను తిరిగి అగ్రస్థానాన నిలబెట్టడానికి వీలుగా భారత్‌కు వివిధ రూపాల్లో బాసటగా నిలిచి పరోక్షంగా మేలు చేస్తారని వారు చెబుతున్నారు. భారత్‌తో సంబంధాలపై 14 ఏళ్ల క్రితమే బైడెన్ తన కలను ఆవిష్కరించారు. 2020 నాటికి భారత్‌తో బంధాలు ఏ విధంగా ఉండాలో అప్పట్లోనే ఆయన నిర్దిష్టంగా చెప్పారు. దానిని సాకారం చేసుకునేందుకు ఇప్పుడు ఆయనకు అవకాశం లభిస్తోంది. ‘నా కల ఏమిటంటే 2020లో ప్రపంచంలో రెండు సన్నిహిత దేశాలుగా అమెరికా-భారత్ ఉండాలి. అది జరిగితే ప్రపంచం సురక్షితంగా ఉంటుంది’ అని 2006 డిసెంబరులో ఒక పత్రికకు ఇచ్చిన ముఖాముఖిలో బైడెన్ చెప్పారు. ఇది 2020లో సాకారమయ్యే అవకాశాలు లేకపోయినా 2021 జనవరి 20న ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగే వీలుంది.
దక్షిణాసియాలో ఉగ్రవాదాన్ని అణచివేయాలని, సీమాంతర ఉగ్రవాదాన్ని సహించరాదని బైడెన్ విశ్వాసం. చైనా సహా ఏదేశం తమ పొరుగు వారిని బెదిరించేలా వ్యవహరించకూడదనేది ఆయన ఎన్నికల ప్రచారంలో చెబుతూ వచ్చిన మాట. భారత్‌తో వాణిజ్య పరిమాణాన్ని మూడింతలు చేయాలనేది ఆయన సంకల్పం.
విధాన పత్రంలో ఏం చెప్పారంటే..
ఎన్నికల ప్రచారంలో భాగంగా బైడెన్ బృందం విడుదల చేసిన విధాన పత్రంలోనూ భారత్‌తో సంబంధాల గురించి సవివరంగా ఉంది. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఒక పద్ధతి ప్రకారం బలోపేతం చేయడం, ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు పెంచడం, ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై భారత్‌తో కలిసి పనిచేయడం వంటి అంశాలపై దీనిలో ప్రస్తావించారు. ఈ రెండు దేశాలు సహజ భాగస్వాములు అనేది ఆయన ప్రబల విశ్వాసం. భారత్‌తో బలమైన బంధాలు కొనసాగుతాయని, దీనికి తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తామని పత్రంలో పేర్కొన్నారు. ‘‘బాధ్యతాయుత భాగస్వాములుగా భారత్-అమెరికా కలిసి పనిచేయకుండా ప్రపంచ సవాళ్లలో ఏ ఒక్కదానినీ పరిష్కరించలేం. భారత రక్షణ రంగం బలోపేతంలో, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో, ఆరోగ్య వ్యవస్థల్ని అభివృద్ధి పరచడంలో, ఉన్నత విద్య, అంతరిక్ష రంగం, మానవతా సాయాన్ని మెరుగుపరచడంలో కలిసి పనిచేస్తాం. ప్రపంచంలో ప్రాచీన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా స్వేచ్ఛాయుత ఎన్నికలు, సమానత్వం, మతస్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వంటివాటిని కొనసాగిస్తూ వస్తున్నాం. భవిష్యత్తులోనూ ఇవి కొనసాగుతాయి’’ అని పత్రం తెలిపింది. ఒబామా-బైడెన్ల హయాంలోనే భారత్‌కు ‘భారీ రక్షణరంగ భాగస్వామి’ హోదా లభించింది.
ఏ రంగాల్లో భారత్‌కు మేలు..
* ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లభించేలా చూడడం
* ఉగ్రవాదంపై పోరులో
* వాతావరణ మార్పులు, ఆరోగ్యం, వాణిజ్య రంగాల్లో...
మరిన్ని

దేవతార్చన
- మూఢత్వమే ప్రాణాలు తీసింది!
- మా చేతులతో మేమే చంపుకొన్నామే..
- 16 మంది మహిళలను చంపిన సైకో!
- నేను శివుణ్ని.. నాకు కరోనా పరీక్షలేంటి?
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- ద్వివేది, గిరిజా శంకర్‌పై ఎస్ఈసీ చర్యలు
- మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
- పుజారా అలా చేస్తే.. సగం మీసం గీసుకుంటా
- బదిలీల ప్రతిపాదన తిరస్కరించిన ఎస్ఈసీ
- దిల్లీలో టెన్షన్.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత!