close

తెలంగాణ లోక్‌సభా స్థానాలు

హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం 

హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం 1951లో ఏర్పడింది. మొదటి నుంచి ఇది జనరల్‌ కేటగిరీలోనే ఉంది. ఈ నియోజకవర్గ పరిధిలో మలక్‌పేట్,  కార్వాన్, గోషామహల్, చార్మినార్‌, చంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, బహదూర్‌పుర అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 

ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో రెండే రెండు పార్టీలు విజయం సాధించడం గమనార్హం. ఏడుసార్లు కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించగా, 1984 నుంచి ఎంఐఎం గెలుపొందుతూ వస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో భాజపా అభ్యర్థి భగవంతరావుపై ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ 2,02,454 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 

భాగ్యనగరం హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం మజ్లిస్‌ పార్టీకి కంచుకోటలాంటింది. 1984 నుంచి ఎంఐఎం పార్టీనే ఈ స్థానాన్ని గెలుస్తూ వస్తోంది. గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీలో నిలిచి, హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకున్నారు అసదుద్దీన్‌ ఓవైసీ. తాజాగా నాలుగోసారి ఆయన పోటీ చేస్తుండగా, అధికార తెరాస పార్టీ నుంచి పుస్తె శ్రీకాంత్‌ బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్‌ నుంచి ఫిరోజ్‌ఖాన్‌, భాజపా నుంచి భగవంతరావు పోటీ చేస్తున్నారు. 

గత ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు వీరే!
* 1951: అహ్మద్ మొహిద్దీన్- కాంగ్రెస్
* 1957: వినాయక్‌రావ్ కోరట్కర్- కాంగ్రెస్ 
* 1962: గోపాలిష్ సుబ్బుకృష్ణ మేల్కొటే- కాంగ్రెస్ 
* 1967: గోపాలిష్ సుబ్బుకృష్ణ మేల్కొటే- కాంగ్రెస్ 
* 1971: గోపాలిష్ సుబ్బుకృష్ణ మేల్కొటే-కాంగ్రెస్ 
* 1977: కేఎస్ నారయణ- కాంగ్రెస్ 
* 1981: కేఎస్ నారాయణ- కాంగ్రెస్ 
* 1984: సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ- ఎంఐఎం
* 1989: సలావుద్దీన్ ఓవైసీ- ఎంఐఎం
* 1991: సలావుద్దీన్ ఓవైసీ- ఎంఐఎం
* 1996: సలావుద్దీన్ ఓవైసీ- ఎంఐఎం
* 1998: సలావుద్దీన్ ఓవైసీ- ఎంఐఎం
* 1999: సలావుద్దీన్ ఓవైసీ- ఎంఐఎం
* 2004: అసదుద్దీన్ ఓవైసీ- ఎంఐఎం
* 2009: అసదుద్దీన్ ఓవైసీ- ఎంఐఎం

* 2014: అసదుద్దీన్ ఓవైసీ- ఎంఐఎం



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net