close

తాజా వార్తలు

దానికి ఆమె సమాధానం చెప్పాలి..


దిల్లీ: రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం బీఎస్పీ అధినేత్రి మాయావతి మీద మండిపడ్డారు. ప్రధాని మోదీ, భాజపాలోని మహిళా నేతలను ఆమె అపకీర్తి పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్వార్ ఘటనతో రాజస్థాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరణ గురించి వివరణ ఇవ్వకుండా మాట మార్చడంపై మీడియా సమావేశంలో ఆమె విరుచుకుపడ్డారు. ప్రధాని మీద చేసిన వ్యాఖ్యలపై ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

‘రాజస్థాన్‌లో జరిగిన అల్వార్ ఘటనను బయటకు రానీకుండా చేస్తోన్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మీరు మద్దతు కొనసాగిస్తారా అని ప్రధాని సరిగా అడిగారు. దానికి ఆమె సమాధానం చెప్పాలి. కానీ అందుకు విరుద్ధంగా ఆమె మోదీ, భాజపాలోని మహిళలను అపకీర్తి పాలు చేస్తున్నారు’ అని సీతారామన్ మండిపడ్డారు. ‘ మహిళల గురించి చివరిసారిగా ఆమె ఎప్పుడు మాట్లాడారు? ఆమె కొన్ని సందర్భాలను ఎంపిక చేసుకొని అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటారు’ అని దుయ్యబట్టారు. ‘ప్రధాని, వ్యక్తిగత జీవితం, భాజపా మహిళా నేతలపై మాయావతి చేసిన వ్యాఖ్యలు షాక్‌కు గురిచేశాయి. తీవ్ర నిరాశను కలిగించాయి. మా పార్టీలో మేమంతా చాలా సంతోషంగా ఉన్నామని ఆమెకు తెలియజేయాలనుకుంటున్నాను’ అని ఆమె స్పష్టం చేశారు. ఆరు దశల్లో జరిగిన ఎన్నికల్లో తమ మహాగత్‌ బంధన్ పరిస్థితిని తలచుకొని, మాయావతి కలత చెందుతున్నారని ఎద్దేవా చేశారు. మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net