బంజారాహిల్స్‌ పీఎస్‌లో కరోనా కలకలం

తాజా వార్తలు

Updated : 05/04/2021 17:11 IST

బంజారాహిల్స్‌ పీఎస్‌లో కరోనా కలకలం

బంజారాహిల్స్‌: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కరోనా కలకలం రేగింది. 11 మంది పోలీసులకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వైరస్‌ సోకిన వారిలో బంజారాహిల్స్‌ సీఐ, ఎస్సైతో పాటు 9 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు.

తొలి దశ కరోనా సమయంలో బంజారాహిల్స్‌ పీఎస్‌ పరిధిలో దాదాపు 50 మంది పోలీసు అధికారులతో పాటు సిబ్బంది వైరస్‌ బారిన పడి కోలుకున్నారు. రెండో దశలో తొలుత 9 మంది కానిస్టేబుళ్లకు.. తాజాగా సీఐ, ఓ మహిళా ఎస్సైకు కరోనా నిర్ధారణ అయింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని