వరుడి హాస్యం, ప్రకృతి హాసం: వైరల్‌ వీడియో

తాజా వార్తలు

Updated : 30/08/2020 18:45 IST

వరుడి హాస్యం, ప్రకృతి హాసం: వైరల్‌ వీడియో

పెర్‌ఫెక్ట్‌ టైమింగ్‌ అంటే ఇదే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ పేరు వింటేనే మానవాళి వణికిపోతోంది. దీనిని ఉనికిలోకి తెచ్చిన 2020 సంవత్సరం అంత మంచిది కాదనే అభిప్రాయం ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమవుతోంది. అదే విషయాన్ని వివాహం జరుగుతున్న సందర్భంగా వరుడు ప్రస్తావించగా... ప్రకృతి కూడా దానికి ప్రతీకాత్మకంగా అంగీకారం తెలిపింది. ఈ సంఘటన అమెరికాలోని మసాచ్యుసెట్స్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి...

ఆరోన్‌ సావిట్స్కీ, డెనిస్‌ మెక్‌ క్లూర్‌ల వివాహం ఓ నది ఒడ్డున పచ్చని ప్రకృతి సమక్షంలో గత శనివారం జరిగింది. ఆ సమయంలో వరుడు మాట్లాడుతూ... ‘‘2020 అంత మంచి సంవత్సరం కాదు... దీనిని ఎదుర్కొందాం.’’ అని హాస్యంగా అన్నారు. ఆయన మాటలు ఇంకా పూర్తయీ అవక ముందే అతని అభిప్రాయంతో ప్రకృతి ఏకీభవిస్తుంది అన్నట్టుగా .. సమీప ఆకాశంలో మెరుపుతో కూడిన ఉరుము ఉరిమింది. అయితే ఈ సంఘటనలో అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు. అనంతరం వర్షం పడకముందే వధూవరులిద్దరూ ఒకటయ్యారట.

ఈ ఆసక్తికరమైన దృశ్యాన్ని వరుడు సావిట్స్కీ.. ప్రకృతి తల్లికి మంచి హాస్యచతురత ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ఇక ఈ వీడియోను చూసిన వారు దానిని లైక్‌లతో ముంచెత్తుతున్నారు. ప్రకృతిది పెర్‌ఫెక్ట్‌ టైమింగ్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ప్రకృతి ఎలా స్పందించిందో మీరూ చూసేయండి.
 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని