టీకా వచ్చిందని..స్టెప్పులేశారు

తాజా వార్తలు

Published : 18/12/2020 17:27 IST

టీకా వచ్చిందని..స్టెప్పులేశారు

నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో

బోస్టన్: 2020లో కరోనావైరస్‌తో ఇబ్బందిపడని వారంటూ ఎవరరూ లేరు. ముఖ్యంగా వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి, విరామం లేకుండా వైరస్ బాధితులకు సేవలు అందించారు. ఈ క్రమంలో టీకా అందుబాటులోకి రావడం వారికి ఆనందాన్ని ఇచ్చింది. అమెరికాలోని బోస్టన్ మెడికల్ సెంటర్‌కు మొదటిసారిగా టీకాలు చేరుకోవడంతో అక్కడి సిబ్బంది పట్టలేని సంతోషంతో డ్యాన్స్‌ చేశారు. లిజ్జొ రూపొందించిన పాటకు వారు చేసిన డ్యాన్స్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. బోస్టన్ మెడికల్ సెంటర్ సీఈఓ తన ఉద్యోగాన్ని ఎందుకు ఇష్టపడుతున్నానో వివరిస్తూ.. ట్విటర్‌లో ఈ వీడియోను పోస్టు చేయడం విశేషం. అలాగే వారు అంత సంతోషంగా స్టెప్పులేస్తున్నప్పటికీ,  భౌతిక దూరాన్ని మాత్రం మరవలేదు. కాగా, నెటిజన్లను ఈ వీడియో ఎంతగానో మెప్పించింది. ఇంటర్నెట్‌లో ఈ రోజు నన్ను అమితంగా ఆకట్టుకున్న విషయం ఇదేనంటూ ఒకరు కామెంట్ చేశారు. 

ఇదీ చదవండి:

కొవిడ్ ఆసుపత్రులపై సుప్రీం కీలక ఆదేశంAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని