ప్రధాని బర్త్‌డే స్పెషల్‌: వర్చువల్‌ వీడియో

తాజా వార్తలు

Published : 17/09/2020 20:46 IST

ప్రధాని బర్త్‌డే స్పెషల్‌: వర్చువల్‌ వీడియో

 

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రధాని నరేంద్ర మోదీ 70వ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ మోదీ సాధించిన విజయాలపై ప్రత్యేక వర్చువల్‌ వీడియోను రూపొందించింది. మోదీ జీవిత విశేషాలు, రాజకీయ ప్రయాణం, ఆయన సాధించిన విజయాల గురించి ఇందులో పొందుపరిచారు. ‘ప్రత్యేకమైన రోజు మీ అభిమాన నాయకుడి జీవిత విశేషాలను ఎన్నడూ చూడని ఫార్మాట్‌లో చూసి శుభాకాంక్షలు తెలపండి’ అని భాజపా ట్విటర్‌ ద్వారా కోరింది.

ఈ వర్చువల్‌ వీడియో నమో యాప్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించింది. ఇదిలా ఉండగా మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని భాజపా సేవా సపథ్‌ పేరుతో వారం రోజులుగా సేవా కార్యక్రమాలను నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సెప్టెంబరు 14న ప్రారంభించారు. మోదీ జన్మదినం సందర్భంగా ఆయనకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని