అక్రమపట్టాల జారీ:ఇద్దరు తహశీల్దార్లపై వేటు

తాజా వార్తలు

Published : 21/08/2020 18:37 IST

అక్రమపట్టాల జారీ:ఇద్దరు తహశీల్దార్లపై వేటు

మఠంపల్లి (సూర్యాపేట): ప్రభుత్వ భూములను అక్రమంగా ఇతరులకు కట్టబెట్టిన ఆరోపణలపై ఇద్దరు తహశీల్దార్లపై వేటు పడింది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 540లో ప్రభుత్వ భూములను అక్రమంగా ఇతరులకు పట్టాలు చేసిన ఇద్దరు తహశీల్దార్లను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో గతంలో మఠంపల్లి తహసీల్దార్‌గా పనిచేసి ప్రస్తుతం గరిడేపల్లి తహశీల్దార్‌గా కొనసాగుతున్న చంద్రశేఖర్‌తో పాటు మఠంపల్లి ప్రస్తుత తహశీల్దార్‌ వేణుగోపాల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఇద్దరు తహశీల్దార్లు మొత్తం 430 ఏకరాల ప్రభుత్వ భూమిని అక్రమ మ్యూటేషన్ ఇచ్చినట్లు ప్రాథమిక సమాచారం. వీరిద్దరిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

వేణుగోపాల్ సర్వే నంబర్ 540లో 52 ఎకరాలను స్థానికులకు అక్రమంగా పట్టాలను ఇచ్చినట్లు.. ఇదే సర్వే నంబర్‌లో చంద్రశేఖర్‌ 369 ఎకరాల ప్రభుత్వ భూమిని గ్లెడ్ ఆగ్రో బయోటెక్ సంస్థకు అక్రమ పట్టాలు జారీ చేసినట్లు తెలిసింది. 540 సర్వే నంబర్‌లో మొత్తం 6 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా ఈ ఇద్దరు తహశీల్దార్లు కలిసి మొత్తం 12 వేల ఎకరాల వరకు పాస్ పుస్తకాలు ఇచ్చినట్లు మఠంపల్లి రెవెన్యూ యంత్రాంగం ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఇక్కడి భూములపై విచారణ జరుగుతోంది. ఈ వ్యవహారంలో మరి కొందరు రెవెన్యూ అధికారులపైనా వేటు పడే అవకాశం ఉంది.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని