AP News: హైకోర్టులో అశోక్‌గజపతిరాజుకు ఊరట

తాజా వార్తలు

Published : 03/08/2021 17:45 IST

AP News: హైకోర్టులో అశోక్‌గజపతిరాజుకు ఊరట

అమరావతి: కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై మంగళవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అశోక్‌ గజపతిరాజు ప్రోద్భలంతోనే మాన్సాస్‌ ట్రస్ట్‌ ఉద్యోగులు ఆందోళనకు దిగారని ఈవో ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో తదుపరి చర్యలు చేపట్టవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

మాన్సాస్‌ ట్రస్టు ఈవో వేతన ఖాతాలు నిలుపుదల చేయడం పట్ల గతనెల 17న విద్యాసంస్థల ఉద్యోగులు మాన్సాస్‌ ఛైర్మన్‌ను కలిశారు. అనంతరం ఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీతాలు ఎందుకు నిలిపివేశారంటూ ఈవోను నిలదీశారు. ఈక్రమంలో ఈవో, ఉద్యోగుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి..  కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన, ఈవోపై దాడికి ప్రేరిపించారనే ఆరోపణలతో అశోక్‌గజపతిరాజుపై విజయనగరం ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని