కొవిడ్‌ సంక్షోభంలోనూ వృద్ధి సాధించాం: గౌతంరెడ్డి
close

తాజా వార్తలు

Updated : 08/06/2021 17:29 IST

కొవిడ్‌ సంక్షోభంలోనూ వృద్ధి సాధించాం: గౌతంరెడ్డి

ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి

అమరావతి: రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు నెలకొన్నప్పటికీ 1.5 శాతం మేర వృద్ధి రేటు నమోదు చేసినట్లు ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వెల్లడించారు. సంక్షేమ పథకాలు, దీర్ఘకాలిక ప్రణాళికతోనే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి గౌతం రెడ్డిని ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌ రోజా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పెట్టుబడుల ఆకర్షణకు మౌలిక సదుపాయాలు ఎంతో అవసరమన్నారు. ఆక్వా, ఫార్మా, ఖనిజ రంగాల్లో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో కొనసాగుతోందని వెల్లడించారు.

రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టుల నిర్మాణంపై దృష్టి సారించినట్లు మంత్రి చెప్పారు. జులైలో నాలుగు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం ప్రారంభించామని.. రెండో దశలో మరిన్ని ఫిషింగ్‌ హార్బర్లు వస్తాయన్నారు. ఇప్పటికే కర్నూలు విమానాశ్రయం జాతికి అంకితం  చేశామని .. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం త్వరిగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వైకాపా.. ఒప్పందాలు మాత్రమే చేసుకునే ప్రభుత్వం కాదని వ్యాఖ్యానించారు. కడప జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్‌ తయారీ క్లస్టర్‌ రాబోతోందని.. స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ఎస్సార్‌ స్టీల్‌ ముందుకొచ్చిందని ఈ సందర్భంగా మంత్రి వివరించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని