APJ Abdul Kalam: ‘రైల్వే’ తుక్కుతో కలాం విగ్రహం!

తాజా వార్తలు

Updated : 26/07/2021 13:36 IST

APJ Abdul Kalam: ‘రైల్వే’ తుక్కుతో కలాం విగ్రహం!

బెంగళూరు: మాజీ రాష్ట్రపతి, మిసైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన దివంగత డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం గురించి ఎంత చెప్పినా తక్కువే. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. చదువే ప్రాణంగా జీవించారు. ఆ చదువుతోనే శాస్త్రవేత్తగా మారి దేశ శాస్త్ర సాంకేతిక రంగంలో విశేష కృషి చేశారు. రాష్ట్రపతి పదవి చేపట్టి దేశానికి ఎంతో సేవ చేశారు. అందుకే, ఆయన గౌరవార్థం కొన్ని ప్రాంతాలకు ఆయన పేరు పెట్టారు. పలు చోట్ల ఆయన విగ్రహాలను ఏర్పాటు చేశారు. అలాగే.. రైల్వేశాఖ కూడా కర్ణాటకలోని యశ్వంత్‌పూర్‌ రైల్వే కోచింగ్‌ డిపో వద్ద కలాంకు నివాళులర్పిస్తూ వినూత్న విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. రైలు డిపోలో తుప్పుపట్టి పక్కకు పడేసిన నట్లు, బోల్టులు, వైర్లు, ఇతర ఐరన్‌ స్క్రాప్‌తో ఈ విగ్రహాన్ని రూపొందించింది. విగ్రహం ఎత్తు 7.8 అడుగుల ఉండగా.. బరువు 800 కిలోలు. పసిడివర్ణంలో ఉన్న కలాం విగ్రహం యశ్వంత్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి తుమకూరుకు వెళ్లే రైల్వే మార్గంలో రైలు ప్రయాణికులకు కనిపించేలా పెట్టారు. దీంతో అటుగా వెళ్లే ప్రయాణికులు ఈ విగ్రహాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

‘‘ఇంజినీర్లందరికీ అబ్దుల్‌ కలాం స్ఫూర్తిగా నిలుస్తారు. అందుకే, ఆయనకు నివాళిగా డిపోలో పనిచేస్తోన్న ఇంజినీర్లు ఐరన్‌ స్క్రాప్‌తో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. పెయింటింగ్‌ కోసం కేవలం రూ. 3వేలు ఖర్చు చేశాం’’అని డిపో సీనియర్‌ ఆఫీసర్‌ వికాస్‌ గుర్వానీ తెలిపారు. కలాం విగ్రహంతోపాటు ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ సింహాం విగ్రహాన్ని కూడా రూపొందించి ప్రదర్శనకు పెట్టారు. ఆ విగ్రహాల ఫొటోలను రైల్వేశాఖ ఇటీవల ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. 




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని