AP News: ఆయుర్వేద ఫార్మసీలో తయారీకి సిద్ధం: చెవిరెడ్డి

తాజా వార్తలు

Updated : 23/05/2021 12:52 IST

AP News: ఆయుర్వేద ఫార్మసీలో తయారీకి సిద్ధం: చెవిరెడ్డి

ఆనందయ్య మందుకు అనుమ‌తి వ‌స్తే తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ప్ర‌ణాళిక‌లు

తిరుప‌తి: నెల్లూరు జిల్లా కృష్ణ‌పట్నానికి చెందిన ఆనంద‌య్య మందుకు అనుమ‌తి వ‌స్తే ఆయుర్వేద ఫార్మ‌సీలో ఔష‌ధం త‌యారీకి తితిదే సిద్ధమని తితిదే పాల‌క‌మండ‌లి స‌భ్యుడు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి అన్నారు. వైద్యుల బృందంతో క‌లిసి ఆయుర్వేద ఔష‌ధాన్ని పరిశీలించామ‌ని చెప్పారు. మందులో దుష్ఫ్ర‌భావ ప‌దార్థాలు లేవ‌ని వైద్యులు చెబుతున్నార‌ని ఆయ‌న తెలిపారు. ఐసీఎంఆర్‌, ఆయుష్ నివేదిక‌ల కోసం వేచి చూస్తున్న‌ట్లు వివ‌రించారు. ఈ మందుకు అనుమ‌తులు వ‌స్తే ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌నే దానిపై ఎస్వీ ఆయుర్వేదిక్ ఆసుప‌త్రి వైద్యులు ఈ ఉద‌యం సమావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్బంగా శ్రీ‌నివాస మంగాపురంలోని శ్రీ‌నివాస ఆయుర్వేదిక్ ఫార్మ‌సీలో వైద్యుల‌తో చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి భేటీ అయ్యారు.  

శేషాచ‌లం అడ‌వుల్లో వ‌న‌మూలిక‌లు అందుబాటులో ఉన్నాయ‌ని చెవిరెడ్డి అన్నారు. ప‌రిశోధ‌న బృందం ఆనంద‌య్య ఔష‌ధాన్ని క‌రోనా మందు కాద‌ని తేల్చినా ఇమ్యూనిటీ బూస్ట‌ర్లుగా ప‌రిశీలిస్తామ‌న్నారు. ఈ మేర‌కు ఆయుర్వేద ఫార్మ‌సీలో ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న‌ట్లు తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని