AP news: ట్రైబ్యునల్‌ ఏర్పాటుపై విజ్ఞప్తులు రాలేదు: కేంద్రం

తాజా వార్తలు

Published : 26/07/2021 15:46 IST

AP news: ట్రైబ్యునల్‌ ఏర్పాటుపై విజ్ఞప్తులు రాలేదు: కేంద్రం

దిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కొత్తగా అభ్యర్థనలు రాలేదని కేంద్రం తెలిపింది. గోదావరి పరివాహక రాష్ట్రాల మధ్య నీటి పంపకాల కోసం 1969లో గోదావరి ట్రైబ్యునల్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. 1980 జులైలో ట్రైబ్యునల్‌ అవార్డు ప్రకటించినట్లు తెలిపింది. ఈ మేరకు రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చింది. మరోవైపు ప్రధాని మోదీకి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి లేఖ రాశారు. కేంద్ర జలశక్తి శాఖ గెజిట్‌లో మార్పులు చేయాలని కోరారు. గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టునూ పొందుపరచాలని విజ్ఞప్తి చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని