Corona Vaccine: నేటి నుంచే కేంద్రం ఉచిత వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌
close

తాజా వార్తలు

Published : 21/06/2021 00:14 IST

Corona Vaccine: నేటి నుంచే కేంద్రం ఉచిత వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా పంపిణీ 

దిల్లీ: కరోనా పోరులో భాగంగా దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరికి సోమవారం నుంచి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా టీకా అందించనుంది. జూన్‌ 21 నుంచి పెద్దలందరికీ ఉచితంగా టీకా అందిచనున్నట్లు ప్రధాని మోదీ జూన్ 7న ప్రకటన చేశారు. అలానే రాబోయే రోజుల్లో కరోనా టీకా సరఫరాను పెంచనున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఉచితంగా టీకా అందివ్వనున్నట్లు ప్రకటించాయి. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవనాన్ని పురస్కరించుకుని ఉచిత టీకా పంపిణీ కార్యక్రమంలో సరికొత్త రికార్డు నెలకొల్పాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి భాజపా పాలిత రాష్ట్రాలు పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి. గతంలో ఏప్రిల్ నెల తొలినాళ్లలో 43 లక్షల మందికి, జూన్‌ 14న 38.2 లక్షల మందికి టీకాలు అందించడం ద్వారా దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొత్త రికార్డులు నెలకొల్పగా..సోమవారం 50 లక్షల రికార్డును సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే దీనికి సబంధించిన ఏర్పాట్లు పూర్తియినట్లు ఆయన చెప్పారు.

ఈ నేపథ్యంలో టీకా తీసుకునేవారు ముందుగా తమ పేర్లను కొవిన్‌ లేదా ఆరోగ్యసేతు యాప్‌లో నమోదు చేసుకోవాలి. అలానే టీకా కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు టీకా తీసుకునే వారి వివరాలు అప్పటికప్పుడు నమోదు చేసుకునేలా ఏర్పాట్లు  చేయాలి. టీకా కోసం ముందస్తుగా నమోదు చేసుకునేవారు కామన్ సర్వీస్‌ సెంటర్‌ లేదా కాల్ సెంటర్ ద్వారా సాయం పొందవచ్చు. ఈ మెగా డ్రైవ్‌ కోసం కేంద్ర ప్రభుత్వం 75 శాతం టీకాలను తయారీదారుల నుంచి కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందివ్వనుంది. మిగిలిన 25 శాతం టీకాలను ప్రైవేటు ఆస్పత్రులు కొనుగోలు చేయవచ్చని తెలిపింది. అలానే టీకా అందించినందుకు సేవా రుసుము రూ. 150కి మించరాదని కేంద్రం ప్రైవేటు ఆస్పత్రులకు నిబంధన విధించింది. ఇది ప్రైవేటులో లభించే టీకా ధరకు అదనం. దీనికి సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతలను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని