ఏపీలో 5వేలు దాటిన కొవిడ్ కేసులు

తాజా వార్తలు

Published : 15/04/2021 17:10 IST

ఏపీలో 5వేలు దాటిన కొవిడ్ కేసులు

బులెటిన్‌ విడుదల చేసిన వైద్యారోగ్య శాఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృ కొనసాగుతోంది. వైరస్‌ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,741 పరీక్షలు నిర్వహించగా.. 5,086 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,42,135 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఐదుగురు చనిపోయారు. అనంతపురం, కర్నూలు, విశాఖలో ఇద్దరు చొప్పున, గుంటూరు, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,353కి చేరింది.

24 గంటల వ్యవధిలో 1,745 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,03,072కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,710 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,55,70,201 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో 617, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 31 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పశ్చిమ గోదావరి, కడప మినహా మిగతా అన్ని జిల్లాల్లో 200కుపైగా కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా కేసుల వివరాలు..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని