మొత్తం డబ్బాలో కరోనా వైరస్‌ !

తాజా వార్తలు

Updated : 11/02/2021 04:34 IST

మొత్తం డబ్బాలో కరోనా వైరస్‌ !

కొవిడ్‌ లెక్కలు తేల్చిన బ్రిటిష్‌ గణిత శాస్త్రవేత్త

లండన్‌: ‘ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తూ వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ మొత్తం ఎంతుంటుందో తెలుసా? దాన్ని చుట్టి ఒక కోక్‌ డబ్బాలో పెట్టేసే అంత.’ అని బ్రిటన్‌కు చెందిన ఓ గణిత శాస్త్రవేత్త వెల్లడిస్తున్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ ఎంత చిన్నగా ఉంటుందో ఈ పరిశోధనలో వెల్లడవుతోంది. బాత్‌ యూనివర్సిటీకి చెందిన గణిత నిపుణుడు కిట్‌ యేట్స్‌ ఈ పరిశోధన నిర్వహించారు. దాని ప్రకారం ప్రపంచంలో  రెండు బిలియన్‌ బిలియన్ల సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ కణాలు ఉండొచ్చని తెలిపారు.

ఈ కరోనా లెక్కల గురించి యేట్స్‌ మాట్లాడుతూ.. ‘‘సార్స్‌-కోవ్‌-2 వ్యాసం సుమారు 100 నానో మీటర్లుగా తీసుకున్నాను. అది ఒక మీటరులో వందో వంతు. దీని ఆధారంగా వృత్తాకారంలో ఉండే వైరస్‌ పరిమాణాన్ని కనుగొన్నారు. కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్ల కోసం లోపలి బయటి భాగాన్ని వదిలేస్తాయి. అలా చూసుకున్నా మొత్తం వైరస్‌ 330 మిల్లీలీటర్లు మాత్రమే. అది ఒక కోక్‌ డబ్బా కన్నా తక్కువ.’’ అని తెలిపారు. గత సంవత్సరంలో కలిగిన ఇబ్బందులు, కష్టాలు, ప్రాణనష్టం అన్నీ మన చేతిలో ఇమిడేటువంటి చిన్నదే చేసింది అనుకోవడం ఆశ్చర్యంగా ఉందని యేట్స్‌ తెలిపారు. కరోనా సృష్టించిన విలయంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 2.34 మిలియన్ల ప్రజలు మరణించారు. 107 మిలియన్ల మంది కరోనా బారిన పడ్డారు.

ఇవీ చదవండి..

ఏసీతో కరోనా వ్యాప్తి ఎలా అంటే..

18న దేశ వ్యాప్తంగా రైల్‌ రోకో


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని