Today Horoscope: ఈ రోజు రాశి ఫలం
close

తాజా వార్తలు

Updated : 07/06/2021 05:05 IST

Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మానసికసౌఖ్యం కలదు. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయవద్దు. గోసేవ చేయాలి.

మిశ్రమకాలం. లక్ష్యాలను సాధించే క్రమంలో ఒత్తిడిని జయించాలి. ఇన్నాళ్లుగా మీకు అనుకూలంగా ఉన్నవాళ్లు వ్యతిరేకంగా మారే అవకాశముంది. ముఖ్య విషయాల్లో ముందుగానే స్పందించండి. గణపతి సహస్రనామ పారాయణం మంచినిస్తుంది.

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. శివుడిని ఆరాధించాలి.

మీ ప్రతిభకు పనితీరుకు అధికారులనుంచి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో అభిప్రాయబేదాలు రానీయకండి. బంధుమిత్రుల వల్ల ధనవ్యయం జరుగుతుంది. సుబ్రహ్మణ్య భుజంగస్తవం పఠించాలి.

శుభకాలం. చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. అవసరానికి తగినసహాయం చేసేవారున్నారు. దుర్గాదేవిని ఆరాధిస్తే మంచిది.

శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సహకారం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన చదివితే మంచిది.

శ్రమ పెరిగినప్పటికీ సంతృప్తికరమైన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఉంది. ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. మహాలక్ష్మీ సందర్శనం శుభప్రదం.

సంకల్పసిద్ధి ఉంది. వ్యయం పెరగకుండా జాగ్రత్తపడాలి.  కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. అభివృద్ధిని ఇచ్చే అంశాల్లో స్పష్టత అవసరం. ప్రశాంతమైన వాతావరణం కలదు. ఆంజనేయ  సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

చేపట్టే పనిలో బద్ధకాన్ని వదలాలి. ఉత్సాహంగా పనిచేస్తే అనుకున్నది దక్కుతుంది. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. ఒక సంఘటన ఆనందాన్నిస్తుంది. ఆదిత్య హృదయం పఠిస్తే బాగుంటుంది.

తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలను రచిస్తారు. అనవసర ఖర్చులు జరగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

తలపెట్టిన పనిలో విజయం సిద్ధిస్తుంది. కొన్ని వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఎట్టిపరిస్థితిలోనూ నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకండి. దత్తాత్రేయ సందర్శనం మరియు శని ధ్యానం శుభప్రదం.

ఒక శుభ వార్త ఆనందాన్నిస్తుంది. ఒక వ్యవహారంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రసంశలు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సూర్య ఆరాధనా శుభప్రదం.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని