Horoscope : ఈ రోజు రాశి ఫలం
close

తాజా వార్తలు

Updated : 09/05/2021 04:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Horoscope : ఈ రోజు రాశి ఫలం

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మీ ప్రతిభకు పనితీరుకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య భుజంగస్తవం పఠించాలి.

చేపట్టిన పనులలో ముందుచూపు అవసరం. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. మనోబలాన్ని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి. ఆదిత్య హృదయం చదవడం ఉత్తమం.

చేపట్టిన పనులను ప్రణాళికా బద్దంగా పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. అవసరానికి తగిన సహాయం చేసేవారున్నారు. కొన్ని విషయమాలలో మీరు అనుకున్నదానికంటే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. ఎవ్వరితోను విభేదించకండి. దుర్గాదేవిని ఆరాధిస్తే మంచిది.

మానసిక సౌఖ్యం కలదు. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయవద్దు. గోసేవ చేయాలి.

దైవబలం విశేషంగా రక్షిస్తోంది. ఆర్థికంగా అనుకూలమైన సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవారాధన శుభదాయకం.

సంపూర్ణ మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. అనవసర విషయాలతో కాలం వృథా కాకుండా చూసుకోవాలి. కలహ సూచన ఉంది. అనవసర ప్రసంగాలు చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. శని ధ్యాన శ్లోకం చదవాలి.

మానసికంగా ద్రుఢంగా ఉంటారు. సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. దుర్గాస్తుతి చేయడం వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు.

శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. స్వస్థాన ప్రాప్తి ఉంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. దుర్గాస్తుతి పఠించాలి.

చేసే పనుల్లో అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికారులను మెప్పించడానికి కాస్త ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. శివ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందగలరు.

శుభ సమయం. కీలక వ్యవహారాల్లో  సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. మీ మీ రంగాల్లో  స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగి మంచి ఫలితాలు పొందుతారు. ఇష్టదైవం ధ్యానం శుభప్రదం.  

శుభ  కార్యక్రమములలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మంచినిస్తాయి, మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారున్నారు. విష్ణుసహస్రనామ పారాయణం చేయాలి.

అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. ఒక వ్యవహరంలో మీ పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని