Corona: కేటీఆర్‌కు అభ్యర్థనల వెల్లువ
close

తాజా వార్తలు

Updated : 26/04/2021 18:15 IST

Corona: కేటీఆర్‌కు అభ్యర్థనల వెల్లువ

హైదరాబాద్‌: ఆపదలో ఉన్న వారికి చేయూతనిచ్చే మంత్రి కేటీఆర్‌కు ట్విటర్‌ వేదికగా సహాయం కోసం అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. కొవిడ్‌ బారినపడి చికిత్స కోసం అవసరమైన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు కావాలని, ఆసుపత్రిలో బెడ్ దొరకట్లేదంటూ, ఆక్సిజన్‌ సిలిండర్‌, ప్లాస్మా, ఆఖరికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షకు సైతం మంత్రి కేటీఆర్‌ను సంప్రదిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల కొరత ఎక్కువగా ఉందని కొందరు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

అదేవిధంగా కొన్ని ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రాల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు పరిమితి సంఖ్యలో చేస్తున్నారని.. వాటి సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరుతున్నారు. వీటన్నింటికీ మంత్రి సానుకూలంగా స్పందిస్తున్నారు. తన వ్యక్తిగత కార్యాలయం వినతులన్నింటినీ పరిష్కరిస్తుందని హామీ ఇస్తున్నారు. అభ్యర్థనలను నోట్‌ చేసుకున్నామని.. వ్యక్తిగత కాంటాక్ట్‌ డీటెయిల్స్‌ షేర్‌ చేయండంటూ మంత్రి కార్యాలయం స్పందిస్తూ అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తోంది. స్వయంగా కొవిడ్‌ బారిన పడి ఐసోలేషన్‌లో ఉన్న మంత్రి కేటీఆర్‌.. రాష్ట్ర ప్రజల వినతులు, ఇబ్బందులను పరిష్కరిస్తూ మరోసారి తన ఉదారతను చాటుకుంటున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని