మహారాష్ట్రలో కోలుకున్న కరోనా బాధితురాలు

తాజా వార్తలు

Published : 21/03/2020 20:19 IST

మహారాష్ట్రలో కోలుకున్న కరోనా బాధితురాలు

ముంబయి: కరోనా వైరస్‌ ప్రభావంతో ఊపిరాడని పరిస్థితికి చేరుకున్న మహారాష్ట్రకు ఇది నిజంగా ఉపశమనం కలిగించే వార్త. గతంలో వైరస్‌ బారిన పడిన ఓ మహిళ పూర్తిగా కోలుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన ఓ మహిళ గతంలో రష్యా, కజకిస్థాన్‌ వెళ్లి వచ్చింది. మార్చి 13న ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్‌ అని తేలింది. దీంతో కొంతకాలం పాటు ఆమెను ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందించారు. తాజాగా డాక్టర్లు చేసిన వైద్యపరీక్షల్లో సదరు మహిళ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు నిర్ధారణ అయింది. ‘మా చికిత్స విధానం పనిచేసింది. మేము రెట్రోవైరల్ థెరపీని ఉపయోగించాం. ఇది మూడు నుంచి నాలుగు ఔషధాల కలయిక. చికిత్స తీసుకున్న ఆ మహిళను ఈ నెల చివరి వరకు పరిశీలనలో ఉంచి ఆ తర్వాత డిశ్చార్జ్‌ చేస్తాం’ అని వైద్యాధికారి ఒకరు తెలిపారు. ఆమె పనిచేసే కళాశాలలో అందరికి వైద్య పరీక్షలు చేయగా ఎవరికీ కరోనా సోకలేదని తేలినట్లు ఆయన చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని