Raghurama: రఘురామ విడుద‌ల వాయిదా

తాజా వార్తలు

Updated : 24/05/2021 13:02 IST

Raghurama: రఘురామ విడుద‌ల వాయిదా

హైద‌రాబాద్‌: న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు విడుద‌ల వాయిదా పడింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఉన్న ర‌ఘురామ ఆరోగ్య ప‌రిస్థితిని గుంటూరు జిల్లా కోర్టు మేజిస్ట్రేట్ అడిగి తెలుసుకున్నారు. ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి స‌మ్మ‌రీని కోరారు. ఈ క్ర‌మంలో ఎంపీకి మ‌రో నాలుగు రోజులు వైద్యం అవ‌స‌ర‌మ‌ని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు మేజిస్ట్రేట్‌కు తెలిపారు. దీంతో వైద్యులు తుది నివేదిక ఇచ్చిన‌ త‌ర్వాతే ర‌ఘురామ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. ఈ నెల 21న సుప్రీంకోర్టు ఎంపీకి బెయిల్ మంజూరు చేసిన‌ప్ప‌టికీ.. గుంటూరులోని ట్ర‌య‌ల్ కోర్టులో కేసు న‌డుస్తుండ‌టంతో పాటు ఆయ‌న రిమాండ్ ఖైదీగా ఉండ‌టం వ‌ల్ల ఎంపీ విడుద‌ల‌కు ఈ ప్ర‌క్రియ జ‌ర‌గాల్సి ఉంది.  

రఘురామను ఈరోజు విడుదల చేసే అవకాశం ఉండటంతో తొలుత ఆయన తరఫు న్యాయవాదులు గుంటూరు జిల్లా కోర్టుకు వెళ్లారు. నేరుగా ఆర్మీ ఆస్పత్రి నుంచి రఘురామను విడుదల చేయాలని న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. మరో నాలుగు రోజులు వైద్యం అవసరమని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు మెజిస్ట్రేట్‌కు తెలపడంతో రఘురామ విడుదల వాయిదా పడింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని