AP News: అవ్వ ఆవేదన ఆలకించేవారేరి?

తాజా వార్తలు

Updated : 11/07/2021 07:56 IST

AP News: అవ్వ ఆవేదన ఆలకించేవారేరి?

ఈ చిత్రంలో కనిపిస్తున్న అవ్వ పేరు  షేక్‌ ఖాసింబీ, వయస్సు 102 ఏళ్లు. యనమదలలో ఉంటున్న ఈమెకు ఆర్మీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పింఛన్‌ను ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. కారణం ఏంటంటే అవ్వ చేతి వేలిముద్రలు, కళ్లు పని చేయడం లేదంటా. ఆమె భర్త షేక్‌ అబ్దుల్‌ సత్తి ఆర్మీలో సేవలందించి 1947లో ఉద్యోగ విరమణ చేశారు. 2007లో మరణించారు. అప్పటి నుంచి భర్త తరఫున పింఛన్‌ను ఆమె ఖాతాలో జమ చేసేవారు. అప్పట్లో నెలకు రూ.300లున్న పెన్షన్‌ ప్రస్తుతం రూ.5,000లకు చేరింది. పాపం 14 నెలల నుంచి డబ్బులు అందకపోవడంతో చిన్న కొడుకు సిలార్‌ అధికారులను కలిసి సమస్యను వివరించగా, గ్రామ సచివాలయానికి పంపిస్తామన్నారు. జులైలో మూడు నెలల పింఛన్‌ రూ.15,000లు రాగా. వేలిముద్రలు, ఐరీష్‌ పనిచేయడం లేదంటూ గ్రామ సచివాలయ సిబ్బంది వృద్ధురాలికి సొమ్ము ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వ వృద్ధాప్య పింఛన్‌ రూ.2,250లను మాత్రం డిజిటల్‌ అసిస్టెంటు తన వేలిముద్రలు వేసి ఇచ్చారు. సొంత ఇల్లులేని అవ్వ, ఆమె కొడుకు కరోనాతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. తన తల్లికి మందులు కొనలేని స్థితిలో ఉన్నానని బాధపడ్డారు. వారి దుస్థితి అధికారులను కదిలించక లేకపోయింది. దీనిపై న్యూస్‌టుడే పంచాయతీ కార్యదర్శి రామకృష్ణారెడ్డి దృష్టికి తేగా, ఉన్నతాధికారుల వద్దకు సమస్యను తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. 
- న్యూస్‌టుడే, యనమదల (ప్రత్తిపాడు)  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని