TS: వినూత్న రీతిలో పోలీసుల అవగాహన

తాజా వార్తలు

Updated : 29/05/2021 21:54 IST

TS: వినూత్న రీతిలో పోలీసుల అవగాహన

హైదరాబాద్‌: కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా వినూత్న రీతుల్లో గుర్రాలమీద తిరుగుతూ పెట్రోలింగ్‌ చేస్తున్నారు. తాజాగా కరోనా ఆకారంలో ఉన్న హెల్మెట్ పెట్టుకుని పెట్రోలింగ్‌ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అనవసరంగా బయట తిరిగి కరోనా బారిన పడవద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమీషనర్‌ అంజనీ కుమార్‌ మాట్లాడుతూ మెహదీపట్నం మార్కెట్‌ చెక్‌పోస్ట్‌ వద్ద కరోనా వైరస్‌ ఆకారంలో ఉన్న హెల్మెట్లు ధరించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ పెట్రోలింగ్‌ చేస్తున్నామని తెలిపారు. గత 15 రోజుల నుంచి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేస్తున్నామని తెలిపారు. నగరంలో 180 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటలూ తనిఖీ చేస్తున్నామన్నారు. ఈ నెలలో లాక్‌డౌన్‌ ఉల్లంఘించినందుకు గాను 7,000 నుంచి 8,000 వరకూ కేసులు నమోదయ్యాయని అలాగే 6,000 నుంచి 7,000 వరకూ వాహనాలను సీజ్‌ చేశామని తెలిపారు. లాక్‌డౌన్‌ నిబంధలను పాటించి పోలీసులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ మే 30 వరకూ కొనసాగనుంది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,527 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 37,793కు చేరుకుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని