close

తాజా వార్తలు

Published : 16/04/2021 09:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒడిశా గ్యాంగ్‌స్టర్‌ హైదరాబాద్‌లో చిక్కాడు

 

హైదరాబాద్‌: ఒడిశా పోలీసుల నుంచి తప్పించుకుని హైదరాబాద్‌లో తలదాచుకున్న గ్యాంగ్‌స్టర్‌ ఎస్‌కే హైదర్‌(60) చిక్కాడు. జహీరాబాద్‌ సమీపంలోని ఓ ఇంట్లో ఆశ్రయం పొందుతున్న అతణ్ని నగర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత సమాచారాన్ని నగర పోలీస్‌ ఉన్నతాధికారులు ఒడిశా డీజీపీ, భువనేశ్వర్‌ పోలీస్‌ కమిషనర్‌కు చేరవేశారు.

పోలీసులకు మత్తు మందు ఇచ్చి...

గ్యాంగ్‌స్టర్‌ హైదర్‌ తన ఏడుగురు అనుచరులతో కలిసి 2005లో ఒడిశా భువనేశ్వర్‌లో ఎస్‌కే సులేమాన్‌ సోదరుడు ఎస్‌కే చునాను దారుణంగా చంపేశాడు. న్యాయస్థానం 2011లో అతనికి జీవిత ఖైదు విధించింది. 2007లో మహాపుత్రలో మైన్స్‌ ట్రేడర్‌ రష్మీ రంజన్‌ను హత్య చేసిన కేసులోనూ 2015లో పదేళ్ల జైలుశిక్ష పడింది. జైల్లో కిడ్ని సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్న అతన్ని పోలీసులు కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్‌ కాలేజీ అండ్‌ హాస్పిటల్‌కు తరలించారు. ఆరుగురు కాపలా సిబ్బందికి చాకచక్యంగా మత్తు మందు ఇచ్చి ఈనెల 10న తప్పించుకున్నాడు. ఓ తెల్లకారు(ఓడీ02 ఏఎస్‌ 6770)లో హైదరాబాద్‌ వైపు వచ్చినట్లు ఒడిశా పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా తేల్చారు. ఈనెల 11న నగర పోలీస్‌ ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. పట్టుకునే బాధ్యతను నగర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు అప్పగించారు. బెంగళూరు, విజయవాడ జాతీయరహదారులు, ఓఆర్‌ఆర్‌పై ప్రత్యేక నజర్‌ పెట్టారు. సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. ముంబయికి వెళ్తున్నాడా అనే కోణంలోనూ ఆరా తీశారు. పటాన్‌చెరు, జహీరాబాద్‌ తదితర ప్రాంతాలపై దృష్టి సారించారు. చివరకు జహీరాబాద్‌లోని ఓ ఇంట్లో ఆశ్రయం పొందుతున్నట్లు గుర్తించారు. ఆ కుటుంబం ఒడిశా నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నట్లు తేల్చారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని